జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతుల నిరసన
17 నుంచి కార్యక్రమాలు
న్యూ ఢిల్లీకి వెళ్ళనున్న 1800 మంది రైతులు
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీ లో నిరసన తెలపాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. డిసెంబరు 17, 18, 19 తేదీల్లో దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి గద్దె తిరుపతిరావు ప్రకటించారు. ధరణి కోట నుంచి ఎర్రకోట వరకు నిరసన యాత్ర ఉంటుందని అమరావతి ఐకాస నేతలు తెలిపారు. 1800 మందితో ప్రత్యేక రైలులో రాజధాని ప్రాంత రైతులు ఢిల్లీ వెళ్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు. 17 జంతర్ మంతర్‌లో ధర్నా చేపడతామని, 18న ఇతర రాష్ట్రాల ఎంపీలను కలవనున్నట్లు వివరించారు. 19న రామ్‌లీలా మైదానంలో జరిగే కిసాన్ సంఘ్‌లో పాల్గొంటామని తెలిపారు.