ap news

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా ఫస్ట్‌.. విజయనగరం లాస్ట్‌

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 75శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో 83శాతం ఉత్తీర్ణత

మే 6వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం

సప్లిమెంటరీ కోసం మే 24 నుంచి జూన్‌1 వరకు వరకు రెండు విడతల్లో పరీక్షలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది విద్యాశాఖ. ఫలితాల వివరాలను మంత్రి బొత్స మీడియాకు వెల్లడించారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

►ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత
►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత
►ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్‌
►ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా సెకండ్‌
►ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్‌

►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్‌
►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 78 శాతం ఉత్తీర్ణతతోగుంటూరు జిల్లా సెకండ్‌
►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా థర్డ్‌
►ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి

►ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత
►ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణత

ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలి: మంత్రి బొత్స
►సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి
►ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి
►మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి
►విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. 4,84,197 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్టియర్‌, 5,19,793 మంది విద్యార్దులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి బొత్స పాల్గొన్నారు. అయితే సీఎం హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా విద్యాశాఖ మంత్రి విజయవాడకు చేరుకోవడం ఆలస్యమైంది. ఈ కారణంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల ఆలస్యమయింది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *