ap news

గోదావరికి వరద ముప్పు

ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటిమట్టం 37.2 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతానికి ఇన్, ఔట్ ఫ్లో 2.9లక్షల క్యూసెక్కులు ఉందని మరింత వరద ప్రవాహం చేరే అవకాశం ఉన్నందున ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు. గోదావరి నదీపరీవాహక ప్రాంతం,లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp