కూటమికి అండగా కాపులు
సీఎం చంద్రబాబుతో మాట్లాడిన కోలా ప్రభాకర్
కాపుల అభివృద్ధికి ప్రణాళిక అమలు చేయాలని వినతి
సానుకూలంగా స్పందించిన చంద్రబాబు
కూటమి ప్రభుత్వానికి కాపుల సహకారం కొనసాగుతుందని ఏపీ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ తెలిపారు. దర్శిలో శనివారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కొద్దిసేపు మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాపులకు ద్రోహం చేశారనీ, రూ 15 వేల కోట్లతో కాపుల సంక్షేమానికి పాటుపడతానని ఎన్నికల మ్యానిఫెస్టో చెప్పి మాట తప్పారని అన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపులు 2024లో కూటమికి అండగా నిలిచారని తెలిపారు. మున్ముందుు కూడా కాపుల సహకారం కొనసాగుతుందనీ, వారి సంక్షేమానికీ, అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక అమలు చేయాలని చంద్రబాబును కోరారు. కోలా ప్రభాకర్ అభిప్రాయాలను విన్న సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
