జైలు నుంచి పట్టాభి విడుదల
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ రాజమంత్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచితవ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభిని మూడురోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ కు పంపారు. శనివారం బెయిల్ రావటంతో ఆయన విడుదలయ్యారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల వీడియోను న్యాయమూర్తికి ప్రభుత్వ న్యాయవాదులు చూపించారు. రెండు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.