ap news

కొటియా గ్రామాల్లో నవరత్నాల హోర్డింగులు

  • కొటియా గ్రామాలలో ప్రోజెక్ట్ అధికారి విస్తృత పర్యటన
  • అర్హులకు సంక్షేమ పథకాలు నిరంతరం అందజేస్తాం
  • కొటియా గ్రామాల్లో నవరత్నాల హోర్డింగులు ఏర్పాటు
  • పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
  • ఎటువంటి అనారోగ్యానికి గిరి అయినా వెంటనే వైద్యులను సంప్రదించండి

ఐ.టి.డి.ఎ ప్రాజెక్టు అధికారి కూర్మనాథ్

కొటియా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుంది అని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రోజెక్ట్ అధికారి ఆదివారం తన పర్యటనలో భాగంగా సాలూరు మండలం పట్టుచెన్నురు, పగులు చెన్నూరు, ఎగువమెండంగి, కొనధారా, సల్పగుడా, డోలియాంబ,మురకాడ పర్యటించారు. పగులు చెన్నూరు తదితర కొటియా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ హోర్డింగులు ప్రోజెక్ట్ అధికారి దగ్గరుండి ఏర్పాటు చేయించారు. ప్రోజెక్ట్ అధికారి కొటియా గ్రామాలలో కాలినడకన తిరుగుతూ అంగన్వాడీ కేంద్రాల భావన నిర్మాణానికి స్థల పరిశీలన నిర్వహించారు, అలాగే పగులు చెన్నూరు నిర్మిస్తున్న అంగన్వాడీ భావన నిర్మాణ పనులు పరిశీలించారు, అలాగే ఎగువమెండంగిలో చేపడుతున్న గృహ నిర్మాణాల పనులు పరిశీలించారు.

గిరిజనులతో మాట్లాడుతున్న అధికారులు

అర్హులైన వారికి నిత్యావసర సరుకుల, పింఛన్లు, తదితర సంక్షేమ పథకాలు అందు తున్నాయా అని అడిగి ఎవరైనా అర్హులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ వెక్షినేషన్ చేయించుకున్నరా లేదా ఎవరైనా తీసుకోకపోతే వెంటనే వెక్షినేషన్ చేయించుకోవాలని హితవు పలికారు. అలాగే ఎవరికైనా జ్వరాలు వచ్చినా, ఏటువంటి అనారోగ్యానికి గురి అయినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచించారు. అలాగే మంగళవారం గ్రామాలలో నిర్వహించనున్న గ్రామసభల్లో అందరూ పాల్గొని అర్హులైన వారు పోడు పట్టాలు, ఉపాధి, గృహాలు, పింఛన్లు నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో పట్టు చెన్నూరు, పగులు చెన్నూరు,ఎగువమెండంగి, కొనధారా, సల్పగుడా, డోలియాంబ, మురకాడ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాల హోర్డింగులను పరిశీలిస్తున్న అధికారులు
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *