ap news

మరో సూట్ కేస్ కంపెనీ..

  • వివిధ సంస్థల సొమ్మును దిగమింగేందుకే
  • ఏ.పి.ఎస్.ఎఫ్.ఎస్.సి ఏర్పాటు
  • ఆర్.బి.ఐ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమేది..!?
  • ప్రభుత్వం ధ్వజమెత్తిన పట్టాభి

ప్రజల సొమ్ము కొట్టేయడానికి జగన్ రెడ్డి సృష్టించిన మరో సూట్ కేస్ కంపెనీయే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ (ఏ.పి.ఎస్.ఎఫ్.ఎస్.సి)
ఏ.పి.ఎస్.ఎఫ్.ఎస్.సికి సంబంధించి ఆర్బీఐ లేవనెత్తిన పలు ప్రశ్నలపై ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు?
****
– ఆర్థికనేరాల్లో ఆరితేరిన జగన్ రెడ్డి, బ్యాంకులను నమ్మొద్దని చెప్పడం విడ్డూరంగా ఉంది.
– విశ్వవిద్యాలయాలు, వివిధ సంస్థల సొమ్ముని దిగమింగడానికే ఏ.పి.ఎస్.ఎఫ్.ఎస్.సి ని సృష్టించారు
– జగన్ రెడ్డి ప్రభుత్వ బ్యాంకులను నమ్మడు గానీ, అవి ఇచ్చే అప్పులు మాత్రం కావాలటా… వాట్ ఏ థింకింగ్?
శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (టీడీపీ జాతీయఅధికార ప్రతినిధి)

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్థిక అవకతవకల పరంపర నానాటికీ వృద్ధిచెందుతోందని, అనేక అర్థిక నేరాలకు పాల్పడిన తన అనుభవానికి తోడు, ఆర్థిక నేరాలతో ఏరకంగా అభివృద్ధి చెందాలనే దానికి సలహాలు సూచనలు ఇవ్వడంకోసం ఏ2 వంటి పండితుల అండ జగన్ రెడ్డికి ఉండటంతో, అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఆయన తన ఆర్థికనేరాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా ….!

గతంలో కూడా ఆర్థికనేరాలు ఎలాచేయాలనే దానిపై షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు సృష్టించడం, మనీలాండరింగ్ చేయడం, అక్రమార్జన గుట్టుగా విదేశాలకు తరలించడమనేది ఏ1, ఏ2లకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రపంచమంతా తెలిసు. ఆ నైపుణ్యంతో నేడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున కూడా సూట్ కేస్, షెల్ కంపెనీలు పెట్టి, వాటి ద్వారా ప్రభుత్వ, ప్రజల సొమ్ముని కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఆర్థిక నేరాల్లో పీహెచ్.డీ సంపాదించిన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించడం, ప్రభుత్వధనాన్ని కొల్లగొట్టడం నిజంగా ప్రజల దురదృష్టం. ప్రభుత్వం తరుపున ఏర్పాటైన సూట్ కేస్ కంపెనీగా జగన్ రెడ్డి సృష్టించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను చెప్పుకోవచ్చు. 06-03-2020న జీవో నెం-18 తీసుకొచ్చి ఏ.పి.ఎస్.ఎఫ్.ఎస్.సి నెలకొల్పిన జగన్ రెడ్డి, తరువాత దానిలో షేర్ హోల్డర్ గా గవర్నర్ తోపాటు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్, చీఫ్ సెక్రటరీతో సహా ఆరేడుగురు ఐఏఎస్ లను చేర్చారు. అటు తరువాత 27-11-2021న ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి, కొన్నిసలహాలు, సూచనలు ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని శాఖలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ట్రస్ట్ లు, ఎస్పీవీలతో సహా అన్నిరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి డబ్బుని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ విధమైన ఆదేశాలిస్తూ, ప్రభుత్వం 25-11-2021న తీసుకొచ్చిన జీవోనెం-1998లో జగన్ రెడ్డి తన దిక్కుమాలిన నిర్ణయాన్ని సమర్థించుకోవడం జరిగింది. ఆ జీవోలో ఏం చెప్పారంటే, గతంలోఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో రూ.9కోట్ల60లక్షలడిపాజిట్లను, దానిలో పనిచేసే కొందరుఉద్యోగులు డూప్లికేట్ ఎఫ్ టీ సర్టిఫికెట్ల సాయంతో కాజేయడానికి ప్రయత్నించారని చెప్పారు. అదేవిధంగా ఏపీ ఆయిల్ సీడ్స్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కు సంబంధించి, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్న రూ.5 కోట్లను కూడా కొల్లగొట్టారని ఉదహరిస్తూ, బ్యాంకుల్లోఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల సొమ్ముకి భద్రత లేదనే అభిప్రాయాన్ని జగన్ రెడ్డి సర్కారు వెలిబుచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వశాఖలు, సంస్థలు, ఇతరత్రా విభాగాలు వాటి సొమ్మును ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లోనే డిపాజిట్ చేయాలన్నఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. అంటే జగన్ రెడ్డి ఇచ్చిన జీవో నెం 1998 ద్వారా పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం సురక్షితం కాదనే ప్రజలంతా అర్థంచేసుకోవాలి. బ్యాంకుల్లో కాకుండా, తాను సృష్టించిన సూట్ కేసు కంపెనీ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లో మాత్రమే డబ్బు డిపాజిట్ చేయాలంటూ జగన్ రెడ్డి అద్భుతమైన జీవో ఇచ్చారు. దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఏవీ సేఫ్ కాదా జగన్ రెడ్డి గారు? కొన్నివేల డిపాజిట్లున్న ఎస్.బీఐ, సెంట్రల్ బ్యాం క్, వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సురక్షితం కాదా ముఖ్యమత్రి గారు? బ్యాంకులు సేఫ్ కావుగానీ, అవి ఇచ్చే రుణాలు (అప్పులు) మాత్రం ఈ ముఖ్యమంత్రికి కావాలి. ఇదేమీ చోద్యమండీ? ముఖ్యమంత్రికి అప్పివ్వటానికి మాత్రమే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కావాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ఆలోచన చేశారు. ఇంకో రెండు, మూడునెలలు పోతే, ప్రజలంతా తమ సొమ్ముని బ్యాంకుల్లో దాచుకోకుండా, తాను సృష్టించిన సూట్ కేస్ కంపెనీ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లోనే దాచుకోవాలనే జీవో ఇచ్చినా ఆశ్చర్యంలేదు. ఆ విధంగా ప్రజల కష్టార్జితాన్నికూడా సాంతం నాకేయడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధమవుతాడేమో అన్నసందేహం కలుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై రూ.3లక్షలకోట్ల అప్పులు మోపిన జగన్ రెడ్డి, అప్పుల ద్వారా తెచ్చింది అంతా స్వాహా చేసింది చాలక, చివరకు డ్వాక్రా మహిళల సొమ్ము, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన దాన్ని, ఉద్యోగుల డబ్బుని కూడా తినేశాడు. అదీ చాలక ఇప్పుడు ఏకంగా బ్యాంకులకే ఎసరుపెట్టాడు. ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థలకు చెంది బ్యాంకుల్లో ఉన్న సొమ్మంతా కూడా వెనక్కులాక్కొని, తనసూట్ కేస్ కంపెనీలకు మళ్లించి, దాన్ని ఆవిరిచేయడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. ముఖ్యమంత్రి ఇలాంటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్ బీఐ (రిజర్వ్ బ్యాంక్) వారు ఊరుకుంటారా? అందుకే ఆర్ బీఐ కన్ను జగన్ రెడ్డి సృష్టించిన ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ పై పడింది. ఆ క్రమంలో ఆర్ బీఐ వారు అక్టోబర్ 8, 2021న ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి రావత్ గారికి ఒక లేఖ రాశారు. రావత్ గారు.. రెండుసార్లు, రెండు ఈమెయిల్స్ ద్వారా సెప్టెంబర్ 2న ఒకసారి, అక్టోబర్ 4న మరోసారి మీకు లేఖలు రాశామని, వాటిలో ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ కు సంబధించిన కొంత సమాచారాన్ని అడిగామని, అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదని, ఏపీప్రభుత్వ వ్యవహారంపై ఆర్ బీఐ చాలా సీరియస్ గా ఉందని ఆర్.బీ.ఐ తెలంగాణ, ఏపీ రీజినల్ డైరెక్టర్ కే.నిఖిల గారు సదరు మెయిల్స్ లో పేర్కొన్నారు. రెండుసార్లు రెండులేఖలు రాసినా ప్రభుత్వం స్పందించకపోతే, మరలా మూడో లేఖ కూడా రాశారు. ఆర్ బీఐ వారు అడిగిన సమాచారాన్నిఇవ్వడానికి ఈ ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి బుగ్గన ఎందుకు జంకుతున్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనే సంస్థపై ఆర్.బీ.ఐకు ఉన్న అనుమానాలను నివృత్తిచేయడానికి జగన్ రెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన ఎందుకు సంకోచిస్తున్నారు? మీరుచేసిన దొంగతనం, దోపిడీ బయటపడతాయనే ఆర్బీఐ వారికి జవాబులు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారా? ఆర్.బీ.ఐ జగన్ రెడ్డి సర్కారుకి రాసిన మూడో లేఖలో ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ కి సంబంధించి దాదాపు 9 ప్రశ్నలు వేసింది. ఇంకో విషయమేంటంటే జగన్ రెడ్డి సృష్టించిన ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనే సూట్ కేస్ కంపెనీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకంటే అధికవడ్డీ చెల్లిస్తుందట. రాష్ట్రప్రభుత్వమే తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టడానికి బయట అప్పులు చేస్తోంది. అలాంటిది బయట బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుందంటే ప్రజలు నమ్మాలా?
ఆర్.బీ.ఐ వారు రాసిన లేఖలో చాలా స్పష్టంగా 2021 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు అడిగితే, ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదు? అలానే జగన్ రెడ్డి సృష్టించిన సూట్ కేస్ కంపెనీ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ కి ఆగష్ట్ 31-2021 నాటికి ఉన్న అసెట్స్ వివరాలు అడిగితే.. వాటిని ఇవ్వలేదు. సూట్ కేస్ కంపెనీకి బ్యాలెన్స్ షీట్లు, ఎసెట్స్ ఉండవని బుగ్గనగారికి కూడాతెలుసు. ఆర్.బి.ఐ లేవనెత్తిన ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియకనే ఇబ్బంది పడుతున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్.బీ.ఎఫ్.సీ) ఏవైతే ఉంటాయో, వాటికి సంబంధించి పీబీసీ (ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియా) అనేది ఒకటి ఉంటుంది. ఎన్.బీ.ఎఫ్.సీలు అన్నీ కూడా పీబీసీ కి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. పీబీసీ ప్రకారం ఫైనాన్షియల్ ఎసెట్స్ అనేవి , టోటల్ ఎసెట్స్ కంటే 50 శాతం ఎక్కువగా ఉండాలి. అలానే ఫైనాన్షియల్ ఇన్ కమ్ ఏదైతే ఉందో, అదీ కూడా 50 శాతం కంటే అధికంగా ఉండాలి. పీబీసీ క్రైటీరియాతో పాటు, జగన్ రెడ్డి సృష్టించిన కంపెనీ ఇన్ కమ్, లయబులిటీ, లావాదేవీలు, వాటి వెనకున్న అసలు ఉద్దేశాలు ఏమిటనే వివరాలను కూడా ఆర్.బీ.ఐ ప్రశ్నించింది. సంస్థల నుంచి డిపాజిట్లు ఏమైనా సేకరించారా? తీసుకునే ఇంటర్ కార్పొరేషన్ డిపాజిట్లకు ఎంత శాతం వడ్డీలు చెల్లిస్తున్నారు? వడ్డీలు కట్టడానికి మీ దగ్గర ఉన్న వనరులేమిటనే ప్రశ్నలను ఆర్.బీ.ఐ వారు, ప్రభుత్వం ముందుంచారు. ఆర్.బీ.ఐ వారు మూడుసార్లు లేఖలురాసినా, జగన్ రెడ్డిగానీ, బుగ్గన గానీ స్పందించలేదు. సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు సృష్టించి వేల కోట్లు కొట్టేసిన అనుభవం కదా మీది. అందుకే ఆర్.బీ.ఐ వారు మీరు సృష్టించిన సూట్ కేస్ కంపనీకి సంబంధించి ఇన్ని ప్రశ్నలు వేశారు జగన్ రెడ్డి గారు. ఆర్.బీ.ఐకి సమాధానం చెప్పకపోతే పోయారు గానీ, కనీసం ప్రజలకైనా సమాధానంచెప్పండి జగన్ రెడ్డిగారు. మీరు సృష్టించిన ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లో ఎవరైనా డబ్బులు పెట్టాలంటే, ముందు ఆర్.బీ.ఐ లేవ నెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి కదా జగన్ రెడ్డి గారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియావారు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, డబ్బులు తీసుకొచ్చి వేయమనగానే ఎలా వేయాలి జగన్ రెడ్డి గారు? సాధారణంగా ప్రజలు ఎవరైనా వారి డబ్బుని బ్యాంకుల్లో వేయాలంటే ఎంత వడ్డీ ఇస్తారు? ఆబ్యాంక్ భద్రమైనదేనా అని ఆలోచిస్తారుకదా? ఏదో ఒక సూట్ కేస్ కంపెనీని సృష్టించి, దానిలో డబ్బు ఉంచితే అధికవడ్డీ ఇస్తానని చెప్పి కలరింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి, ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు జగన్ రెడ్డి గారు? మీరు చేయాలనుకుంటున్న దోపిడీ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులను పనికిరాని వాటిగా చూపుతారా? ఈ విధంగా మీ దోపిడీకోసం, దొంగపనులకోసం ఇచ్చిన జీవోలను కూడా బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. ఆన్ లైన్ లో వాటిని అప్ లోడ్ చేయలేదు. ఈ ముఖ్యమంత్రి నిర్వాకంతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సిబ్బంది ఇప్పటికే తమ విశ్వవిద్యాలయం సొమ్ములు పోయాయని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నూటికి నూరుశాతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనేది జగన్ రెడ్డి సృష్టించిన సూట్ కేస్ కంపెనీనే. కేవలం ప్రజల సొమ్ముని కొల్లగొట్టడానికే జగన్ రెడ్డి దాన్ని సృష్టించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసం కాదని చెప్పగల ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉంటే, ఆయన ఆర్థికమంత్రి బుగ్గన తక్షణమే ఆర్.బి.ఐ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. వారు జవాబు చెప్పలేనంత వరకు ఏ ప్రభుత్వశాఖ నుంచి, విశ్వవిద్యాలయాలు, ఇతరసంస్థల నుంచి రూపాయికూడా తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నాం. ప్రజలంతా కూడా ఆర్.బి.ఐ వారు ప్రభుత్వానికి రాసిన లేఖలు, అడిగిన ప్రశ్నలపై ఆలోచించాలని కోరుతున్నాం.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *