ap news

పెగాసెస్ పై దేనికయినా సిద్ధమే..!

ఏ విచారణయినా ఎదుర్కొంటాం..

బాబాయ్ హత్యపై విచారణకు సిద్ధమా..

మద్యం బ్రాండ్లపై కెమికల్ అనాలసిస్ బయటపెడతాం..

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 

పెగాసెస్ పై హౌస్ కమిటీ.. జూడిషియరీ కమిటీ.. సీబీఐ విచారణ..దేనికయినా తాము సిద్ధంగానే ఉన్నామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే క్లారిటీ ఇప్పటికీ లేదు.మమతా బెనర్జీ బెెంగాలీలో మాట్లాడిన వీడియోలో అసలు చంద్రబాబు గారి ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన నా స్నేహితుడు చెప్పాడు.వ్యక్తిగత విషయాలు వినే అలవాటు మాకెవరికీ లేదు.. జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందేమో.. అందుకే అంబటి రాసలీలలు బయట పడ్డాయన్నారు. మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చారంటూ పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై సభలో చర్చకు పెట్టారు. మండలి బిజినెస్ లేకుండానే పెగాసెస్ పై చర్చ పెట్టారు..పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు రిప్లై ఇచ్చారు..వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారు..అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై స్వల్ప కాలిక చర్చకు మండవి ఛైర్మన్ అనుమతించారు..మేం మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు ఛైర్మన్ అనుమతించలేదు..తప్పుడు సమాచారంతో సభలో చర్చకు పెట్టారు..బాబాయ్ హత్య విషయంలోనూ.. కల్తీ సారా, జే బ్రాండ్ల మరణాల విషయంలోనూ విచారణకు జగన్ రెడ్డి సిద్ధమా..ఐదు రోజులుగా మద్యం.. కల్తీ సారా మరణాలపై పోరాడుతున్నాం..సారా మరణాలను సహజ మరణాలుగా సీఎం తీసిపారేయడం బాధాకరం..ప.గో జిల్లాలో కల్తీ సారా వల్ల మొత్తంగా 42 మంది చనిపోయారు..

మీడియాతో మాట్లాడుతున్న నారా లోకేష్

మద్యం బ్రాండ్లపై కెమికల్ అనాలసిస్ 

ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం.. ఒక సామాజిక కార్యకర్త చేయించిన డీప్ కెమికల్ అనాలిసిస్ లో జే బ్రాండ్ల లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్టు తేలింది..త్వరలోనే ఆ రిపోర్టులు బయట పెడతాం..కల్తీ సారాతో.. కల్తీ మద్యంతో పేదలను ఈ ప్రభుత్వం చంపేస్తోంది..జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసపు రెడ్డి అని పిలిచేది ఇందుకే..ప్రజల ప్రాణాలకంటే మరేదైనా పెద్ద సమస్య ఉందా..?ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారు.. భవిష్యత్తులో వైసీపీకి 15 మంది ఉండని పరిస్థితి వస్తుంది..బాబాయ్ హత్య విషయంలోనూ అబద్దాలే ఆడారు.. డీఎస్పీ ప్రమోషన్ల విషయంలోనూ, అబద్దాలే చెప్పారు. పింక్ డైమెండ్ అంటూ కట్టు కధ అల్లారు..అమరావతిలో ఎకరాలు కొన్నానని ప్రచారం చేసారు… మూడేళ్లు అయ్యింది ఒక్క సెంటు భూమి కొన్నానని నిరూపించగలిగారా..మేము చట్టాలను అతిక్రమించం. అందుకే మూడేళ్ల నుండి ఎన్ని విచారణలు చేసుకున్నా జగన్ రెడ్డి పీకింది ఏమి లేదు..చంద్రబాబు వ్యవస్థల్ని గౌరవిస్తారని లోకేష్ అన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *