సాగరం

సభలో మాట్లాడుతున్న ప్రముఖ కవి, రచయిత టి.అరుణ

తనొక కల్లోల సాగరం
బ్రతుకులో సుడిగుండాల్ని
తనలో మిళితం చేసుకుని
తనతో తనే యుద్ధం చేస్తుంటాడు
ఏదో ఆశించి భంగపడిన
కవి హృదయం అతనిది
ఆత్మీయ స్పర్శకు కరుగుతూ
నిరాకరణతో కరుడుగడుతూ
పగలబోతున్న లావాలా
నిత్యం అతనొక విస్ఫోటనం
జిప్పీ సంపుటిలా జీవితం
నిశ్శబ్దాన్ని దహనం చేస్తూ
సాగిపోతున్న కవితా సాగరం అతను
ఒడ్డున మాత్రమే ఉప్పొంగుతాడు
లోలోపల ప్రశాంత సాగరమతడు

శ్రీరామకవచ సాగర్
కవి, నవలా రచయిత

Leave a Reply

Your email address will not be published.