ap news

జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్

స్పోర్ట్స్ క్లబ్ యాప్ ప్రారంభిస్తున్న మంత్రి రోజా, సిద్దార్ద్ రెడ్డి

ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక క్రీడలు,  యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా బుధవారం సచివాలయంలో జగనన్న స్పోర్ట్స్ యాప్ ను ప్రారింభించారు. జగనన్న స్పోర్ట్స్ యాప్ ద్వారా క్రీడాకారులు వారి సంక్షిప్త సమాచారాన్ని అందించటం ద్వారా వారి సమాచారం క్రీడాశాఖకు చేరుతుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా సమాచారం అందించడం ద్వారా క్రీడాకారులకు ప్రభుత్యం నుండి మరింత ప్రోత్సాహకాలు అందిచనున్నాం. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తుంచడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని రోజా అన్నారు. ఆ లక్ష్యం దిశగా క్రీడాశాఖ ముందుకు వెళ్ళేందుకూ,  క్రీడకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఈ యాప్ దోహదం చేస్తుందని ఆమె అన్నారు.

సీఎం కప్ టోర్నమెంటులు నిర్వహించాలి

ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి రోజా కొన్ని జిల్లాలో పెండింగ్ లో ఉన్న సీఎం కప్ టోర్నమెంట్ లను త్వరగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్రీడా మైదానాలు నిర్మాణం, నిర్వహణలపై అధికారులతో ఈ సమావేశంలో మంత్రి  చర్చించారు. ఈ సమీక్షలో శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి,  స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ ఐఏఎస్,  శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్షా సమావేశంన నిర్వహిస్తున్న దృశ్యం
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *