ap news

చంద్రబాబు రోడ్ షో..నందిగామలో సూపర్ హిట్

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో

వేల సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు

గాంధీ సెంటర్ లో టిడిపి అధినేత చంద్రబాబు ప్రసంగం హైలెట్స్ 

• తన రోడ్ షో లో కాన్వాయ్ పై రాయి విసిరిన ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
• దొంగల్లా వైసిపి వాళ్లు రాళ్లు విసిరారని మండిపడ్డ చంద్రబాబు
• అక్రమ కేసులు, దాడులతో రాజ్యం చేయాలని అధికార వైసిపి చూస్తోంది.
• కేసులు, దాడులకు భయపడే పార్టీ కాదు టిడిపి
• కేసులు పెడితే ఎన్ని పెడతారు..ఇంటికొక కేసు పెడతారా?
• అయ్యన్న పై తప్పుడు కేసు పెడితే ఏమయ్యింది.?
• రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలి అంటే మళ్లీ టిడిపి జెండా ఎగరాలి

నందిగామలో చంద్రబాబు రోడ్ షోకు హాజరయిన జనసంద్రం

• రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అంతా కలిసి రావాలి
• విభజన జరిగిన తరువాత రాష్ట్రాన్ని గాడిన పెట్టాను
• నాది విజన్…వైసిపిది విధ్వంసం
• హైదరాబాద్ లో నాడు వేసిన ఫౌడేషన్ తో సంపద సృష్టి జరిగింది
• దీని వల్ల పేదలు లబ్ది పొందే పరిస్థితి వచ్చింది.
• రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం ఇప్పుడు ఉన్న సిఎం జగన్ రెడ్డి
• ఈ అప్పులు ఎవరు కడతారు…జగన్ కడతారా….మనమే కట్టాలి
• ఉత్తరాంధ్ర భూములు తాకట్టి పెట్టి 23 వేల కోట్లు అప్పు చేశాడు
• ఇలాంటి పెద్దమనిషి ఉత్తరాంధ్రను అభివృద్ది చేస్తారా
• పెన్షన్ 200నుంచి 2000 చేసింది తెలుగు దేశం పార్టీ
• నందిగామలో సుబాబుల్ రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు
• సుబాబుల్ టన్నుకు 5 వేలు ఇస్తాను అన్న జగన్ ఇచ్చాడా?
• నందిగామలో ఎమ్మెల్యే, సోదరులు ఇసుకలో దోచుకుంటున్నారు
• పాదయాత్రలో ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు కనిపిస్తున్నాడా?
• కాకినాడ కు చెందిన ఆరుద్ర అనే మహిళ కూతురు వైద్యం కోసం చాలా ఇబ్బంది పడింది.


• 1000 కంటే ఎక్కువ ఖర్చు అయితే వైద్యం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు..ఎక్కడైనా అమలు అవుతుందా
• వైద్యం కోసం ఆ మహిళ ఇంటిని అమ్ముకుంటాను అంటే కూడా మంత్రి మనుషులు అడ్డుపడ్డారు.
• తన బాధ చెప్పుకునేందుకు తాడేపల్లి సిఎం ఇంటికి వచ్చింది ఆ మహిళ
• సిఎంను కలవనీయకపోవడంతో తాను చేయికోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంది.
• ఈ ముఖ్యమంత్రి కి మానవత్వం ఉందా…ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలా?
• రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయిన వర్గం రైతాంగం
• మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్లు వేస్తున్నాడు
• ముక్త్యాల లిఫ్ట్ స్కీం ఏమయ్యింది. టిడిపి హయాంలో మొదలు పెట్టిన పథకం ఏమయ్యింది
• అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసింది….పది మందికి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ ఎందుకు మూసేశారు?
• జగన్ తండ్రి పేరుతో జిల్లా పేరు ఉంటే మేము మార్చామా….కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు జగన్ మార్చాడు
• వైఎస్ ఆర్ విగ్రహాలు ఉంటే మేం తొలగించామా…మేము ఆ నాడు ఇలాగే వ్యవహరించి ఉంటే ఎలా ఉండేది?
• రాష్ట్రంలో జగన్ పాలనలో ఉపాధి లేదు….ఉద్యోగాలు లేవు…పరిశ్రమలు లేవు
• టీచర్లు ఉద్యోగాలు, ఐటి ఉద్యోగాలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ
• పోలీసులకు చట్టాలు ఉంటాయి….వాళ్లు గుర్తుపెట్టుకోవాలి
• కనీసం పోలీసుల బకాయిలు కూడా చెల్లించని ప్రభుత్వం ఈ ప్రభుత్వం

ప్రజలకు విక్టరీ సంకేతాన్ని చూపిస్తున్న చంద్రబాబు

• జగన్ బటన్ ఇన్ కార్యక్రమం పెట్టుకున్నాడు. సాయంత్రం అవ్వగానే తన ఆదాయం పై లెక్కలు మొదలు పెడతాడు
• మద్యం మొదలు అన్నింటా అక్రమార్జన చేస్తున్నాడు.
• రానున్న రోజుల్లో జగన్ కోడికత్తి లాంటి డ్రామాలు చాలా ఆడుతాడు…మనం అలెర్ట్ గా ఉండాలి
• నేను ఈ రోజు పరితపించేది నాకోసం కాదు…రాష్ట్రాన్ని బాగు చేసేందుకు నా ఆలోచన
• రాష్ట్రం బాగుంటేనే మీ బతుకులు బాగుంటాయి
• రానున్న ఎన్నికల్లో వైసిపి ని చిత్తు చిత్తుగా ఓడించాలి అని నేను పిలుపునిస్తున్నాను.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *