తారకరత్న కన్నుమూత
నటుడు నందమూరి తారకరత్న (39) కన్ను మూశాశారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో గడిచిన 23 రోజులుగా చికత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తొలిరోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన గుండెపోటుకు గురయి స్పృహ కోల్పోయారు. కుప్పం ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. ఆయనను బతికించటం కోసం వైద్యులు అహర్నిశలు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తారకరత్న మరణించినట్టు శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఆయన అకాల మృతి చిత్ర పరిశ్రమతో పాటు తెలుగుదేశం పార్టా వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అన్ని వర్గాల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.
విషాదం మిగిల్చి వెళ్ళిపోయాడు.. చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.