కుప్పం వెళ్ళనున్న చంద్రబాబు
28 నుంచి మూడురోజుల పాటు పర్యటన
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పాటు సొంత నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మూడురోజులు పాటు జరిగిన యాగం ఆదివారం ముగియడంతో మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. పార్టీలో వైసీపీ నేతల చేరికల అనంతరం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు. 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్లోనే చంద్రబాబు ఉండనున్నారు. ఈ నెల 28వ తేదీన చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు.