మాజీ మంత్రి ఆళ్ళ నాని హఠాన్మరణం
మాజీ మంత్రి ఆళ్ళ నాని ఇక లేరు. గుండె పోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. విశాఖలో మంగళవారం ఆయన గుెండె పోటుతో మృతి చెందారు. వైసీపీ హయాంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన 2024 ఎన్నికల అనంతరం ఇటీవల టీడీపీలో చేరారు. మృదు స్వభావిగా, మంచి నాయకుడిగా పేరున్న ఆళ్ళ నాని చిన్న వయసులోనే ఆకస్మికంగా మృతి చెందటం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు నాని మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
సీఎం చంద్రబాబు సంతాపం


