రాజమండ్రి ఖైదీకి గోల్డ్ మెడల్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, బుక్ ప్రైజ్ అందుకుంటున్న రాజమండ్రి కేంద్ర కారాగార ఖైదీ సురేష్

అరుదైన ప్రతిభ చాటుకున్న రాజమండ్రి ఖైదీ సురేష్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ కోర్సులో
గోల్డ్ మెడల్ తో పాటు బుక్ ప్రైజ్
తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం

రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఎన్.సురేష్ విద్యా రంగంలో ప్రతిభ చాటుతూ అరుదైన ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించిన బీఏ కోర్సులో అత్యధిక సమగ్ర మార్కులు సాధించినందుకు ఆయనకు ప్రతిభా గోల్డ్ మెడల్‌తో పాటు బుక్ ప్రైజ్ లభించింది.హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ షీవ్ ప్రతాప్ శుక్లా ఎన్. సురేష్‌కు గోల్డ్ మెడల్, బుక్ ప్రైజ్ ప్రదానం చేశారు.

ఖైదీలకు స్ఫూర్తిదాయకం

ఈ సందర్భంగా రాజమహేంద్రం కేంద్రం కారాగారం జైల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి. సన్యాసిరావు మాట్లాడుతూ.. జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ విద్యపై ఆసక్తి, పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా ఎన్. సురేష్ ఇతర ఖైదీలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆయన సాధించిన ఈ విజయం కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరం సిబ్బందికి గర్వకారణంగా నిలిచిందన్నారు. ఖైదీలలో విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం ద్వారా వారిలో సానుకూల మార్పు తీసుకురావడానికి కారాగార శాఖ కృషి చేస్తోందన్నారు. ఎన్. సురేష్ సాధించిన గోల్డ్ మెడల్ ఆ కృషికి తగిన ఫలితమే దానికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఎన్. సురేష్ ఈ ఘనత సాధించేందుకు మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, సహకారం అందించి డీజీ, ఐజీ, డీఐజీ అధికారులకు, అప్పటి కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ కు డా. సన్యాసిరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *