నల్లమల్లి శ్రీ శిల్పకు ‘మెగా’ మద్దతు..!

తెలుగుదేశం అభ్యర్ధిగా ఒంగోలు మేయర్ ఎన్నికల బరిలో నిలబడిన నల్లమిల్లి శ్రీ శిల్పకు పరోక్షంగా మెగా కుటుంబం నుంచి కూడా మద్దతు ఉన్నట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కాపు సామాజికవర్గానికి చెందిన శ్రీ శిల్పకు అల్లు కుటుంబంతో ఉన్న బంధుత్వం సీటు రావటానికి అదనపు మద్దతుగా నిలిచినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాపులకు మేయర్ సీటివ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిర్ణయించిన నేపధ్యంతో జనసేన పెద్దల నుంచి కూడా మద్దతు లభించింది. అందువల్లనే తెరమీదకు వచ్చిన ఇతర కాపు, వైశ్య నేతలను పక్కనపెట్టి శ్రీ శిల్పకు సీటు కేటాయించినట్టు పొలిటికల్ సర్కిల్ టాక్. దామచర్ల జనార్దన్ కూడా వైశ్య సామాజికవర్గానికి చెందిన నల్లమల్లి బాలు కంటే కాపు సామాజకవర్గానికి చెందిన శ్రీ శిల్పకు సీటివ్వటానికే మొగ్గు చూపారు. వైసీపీ అభ్యర్ధిగా ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన కుప్పం ప్రసాద్ కు సీటివ్వటంతో శ్రీ శిల్పను అభ్యర్ధిగా నిలబెట్టటం ద్వారా ఒక వైపు కాపుల్లో అసంతృప్తి రాకుండా, మరో వైపు వైశ్యుల మద్దతు కూడగట్టేందుకు అవకాశం ఉంటుందని భావించారు.


