రంగుల ఆర్ట్ష్ గ్యాలరీ చిన్నారికి గోల్డ్ మెడల్
ఒంగోలులోని రంగుల ఆర్ట్ష్ గ్యాలరీలో శిక్షణ పొందుతున్న ఆరు సంవత్సరాల పల్లపోతు శాన్విశ్రీ వరేణ్య నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. రాజమండ్రిలోని భగీరధ ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో శాన్విశ్రీ వరేణ్య బంగారు పతకం సాధించింది. రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో వరేణ్య బంగారు పతకం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, ఏఎస్ పీ మురళీకృష్ణ తో నగర ప్రముఖులు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని అభినందించారు.
