టెలికం సలహా కమిటీ సభ్యునిగా నిమ్మరాజు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) గుంటూరు జిల్లా సలహా కమిటి సభ్యునిగా సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు నియమితులైనారు. శుక్రవారం బిఎస్ఎన్ ఎల్ (BSNL) జిల్లా ఎ.జి.ఎం శ్రీ ప్రసన్న కుమార్ నుంచి నియామక పత్రం అందుకొన్నారు. ఈ కార్యక్రం లో టెలికాం సబ్-డివిజనల్ అధికారి శ్రీ మొండితోక వెంకట్రావు పాల్గొన్నారు . టెలికాం శాఖ గుంటూరు జిల్లా కమిటీలో నిమ్మరాజు చలపతిరావుతో పాటు పార్లమెంట్ సభ్యులు శ్రీ గల్లా జయదేవ్, శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయులు కూడా ఉన్నారు.
నిమ్మరాజు చలపతిరావు ఇదే కమిటీలో 1998-2000 సంవత్సరంలో రెండు ఏళ్ళ పాటు సభ్యునిగా పనిచేశారు. చలపతిరావు 1980 నుంచి 2000 వరకు 20 ఏళ్ళ పాటు గుంటూరు జిల్లాలో ఆంధ్ర పత్రిక, ఆంధ్ర భూమి దినపత్రికలలో స్టాఫ్ రిపోర్టర్‌గా పని చేయడం జరిగింది. అదే సమయంలో ఏపియు డబ్ల్యుజె (APUWJ) గుంటూరు జిల్లా కన్వీనర్, కార్యదర్శి మరియు అధ్యక్షునిగా, తర్వాత రాష్ట్ర కార్యదర్శి గా కుడా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.