gunturu

వాలంటీర్లకు వందనం

నేడు నరసరావుపేటలో 

సేవా అవార్డు ప్రదానం చేయనున్న సీఎం 

వరసగా రెండో ఏడాది కూడా…గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.  నేడు (07.04.2022, గురువారం) పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో  పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మందికి రూ. 258.74 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు.

ఇవీ హైలెట్స్ .. 

గత సంవత్సరం అందించిన రూ. 226.7 కోట్లతో కలిపి రెండేళ్ళలో మొత్తం రూ. 485.44 కోట్ల నగదు పురస్కారాలు

ఏప్రిల్‌ 7 వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావారణంలో వాలంటీర్లకు అవార్డుల ప్రధానం

కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు

తెలతెల వారుతూనే తలుపు గుమ్మం తట్టి పెన్షన్లు అందచేస్తున్న ఒంగోలులోని వాలంటీర్ తాండ్ర వెంకట దుర్గ (ఫైల్ ఫొటో)

సేవా సైన్యానికి సలాం…

సేవా వజ్ర
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డుల ప్రధానం

సేవా రత్న
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున మొత్తంగా 4,136 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డుల ప్రధానం

సేవా మిత్ర
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 10,000 నగదు బహుమతి. రాష్ట్రవ్యాప్తంగా 2,28,322 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డుల ప్రధానం

వాలంటీర్ల సేవలు – సేవా సైన్యానికి సలాం

అవినీతికి తావులేకపోవడం, సచ్చీలత, ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్‌ డోర్‌ డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తదితర అంశాల్లో పనితీరు ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక వివిధ పథకాల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నిర్వహించి అవినీతి, పక్షపాతం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించినందుకు..

గ్రామ, వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని 50,100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు, గ్రామ, వార్డు సచివాలయానికి, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరించినందుకు.. కోడి కూయకముందే ఇంటి తలుపు తట్టి, చిరునవ్వుతో గుడ్‌మార్నింగ్‌ చెప్పి మరీ ఠంచన్‌గా పింఛన్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే అందిస్తున్నందుకు..పెన్షన్‌లతో పాటు రేషన్‌ డోర్‌ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్ధిష్ట కాలపరిమితిలో అందిస్తున్నందుకు..వరదలు, విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు దిశ వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు..జగనన్న సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజల దగ్గరకు వెళ్ళి వివరించి అవసరమైతే దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులైనందుకు గుర్తింపుగా అవార్డులు ప్రదానం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మందికి రూ. 239.22 కోట్ల నగదు పురస్కారాలు.
  • గత సంవత్సరం అందించిన రూ. 226.77 కోట్లతో కలిపి రెండేళ్ళలో మొత్తం రూ. 465.99 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *