కుప్పానికి కృష్ణమ్మ
- ఫలించిన చంద్రబాబు కృషి…. 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి చేరుకున్న కృష్ణా జలాలు
- 19 నియోజకవర్గాలను తాకుతూ….10 రిజర్వాయర్లను నింపుతూ శ్రీశైలం నుంచి నదీ జలాలు
- రాయలసీమను కోనసీమ చేసేలా రికార్డు టైంలో హంద్రీ-నీవా విస్తరణ పనులు
- శనివారం కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మకు జల హారతి ఇవ్వనున్న సిఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 29: రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు ఎన్టీఆర్ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే…ఆయన కలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు. సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు. సీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లూ కల.. కానీ ఇప్పుడు అది నిజం. ఈ కలను చంద్రబాబు నిజం చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది మొదటి నుంచి తెలుగు దేశం పార్టీ సంకల్పం. సీమలో ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్ అయితే…వాటిని ముందుకు తీసుకువెళ్లి ఆ కలను నిజం చేసింది చంద్రబాబు నాయుడు. అతి తక్కువ వర్ష పాతం ఉండే సీమ జిల్లాల్లో నీళ్లతోనే సీమ ప్రజల స్థితిగతులు మారుతాయని ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో 1999 జులై 9 చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ రోజు బీడు భూముల్లో నీళ్లు పారేలా చేశారు. ఇదంతా రాత్రికి రాత్రి ఇది జరగలేదు. 2014 నుంచి నేటి వరకు ప్రభుత్వం భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులపై నిధుల ఖర్చు చేయడం వల్ల నేడు హంద్రీనీవా నీళ్లు చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయి.
హెచ్ఎన్ఎస్ఎస్ కు నాడు అత్యంత ప్రాధాన్యం
హంద్రీనీవా ప్రాజెక్టుపై 2014-19 మధ్య రూ.4,183 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సీజన్‌లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు.
సాగు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుంది
సాగు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ చెబుతారు. చెప్పడమే కాదు.. దాన్ని చేసి చూపించాలన్న సంకల్పంతోనే రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీ-నీవా కాల్వ విస్తరణ పనులతో సీమకు జలకళ వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది. విస్తరించిన కాల్వల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాకింది. 10 రిజర్వాయర్‌లను నింపుతోంది. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురం జిల్లాలో జీడిపల్లి, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లు నిండాయి. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి… అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసాపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నిండుతున్నాయి. అలాగే గాజుల దిన్నెకు నీరు చేరింది.
చిత్తూరు సస్యశ్యామలం
హంద్రీనీవా ఆయకట్టులో చిట్ట చివరి జిల్లా చిత్తూరు. చిత్తూరు జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా… కేవలం 6 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. మిగిలిన 10 లక్షల ఎకరాలకు సాగునీరిస్తే…రైతన్నకు నీటి కొరతే ఉండదు. హంద్రీనీవా రెండో దశ పనులు పూర్తి చేసి జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రభుత్వం ఇవ్వనుంది. చిత్తూరు జిల్లాలో సాగు అంతా బోర్లపైనే ఆధారపడి ఉంది. 565 కి.మీ. మేర ఉన్న పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయల్పాడు, సదుం బ్రాంచ్ కాలువలతో 1,86,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది.
పరమ సముద్రానికి కృష్ణా జలాలు
గత నెల 17వ తేదీన కర్నూలు జిల్లా మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేశారు. నాటి నుంచి హంద్రీనీవా కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మ 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి చేరింది. పరమ సముద్రంలో సిఎం చంద్రబాబు కృష్ణా జలాలకు హారతి ఇవ్వనున్నారు. తరలి వచ్చిన కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. జల హారతి కార్యక్రమం కోసం కుప్పం వెళుతున్న సిఎం వారి సంతోషాన్ని పంచుకోనున్నారు.
కుప్పం బ్రాంచ్ కెనాల్
215 క్యూసెక్కుల సామర్ధ్యంతో 123 కి.మీ. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది. ఈ కాలువ ద్వారా 4 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడమే కాకుండా…110 చెరువులు నింపడం ద్వారా 6,300 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ది సంకల్పంతో 40 టిఎంసిల నీటిని ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయల సీమ జిల్లాలు వినియోగించుకోనున్నాయి. చెరువుల అన్ని నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దీంతో సీమలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. ఉద్యాన పంటల ఉత్పత్తులు పెంచేందుకు సాగునీటి సౌకర్యం ఎంతో దోహదం చేయనుంది. ఈ ప్రాంత రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరగనున్నాయి.
హెచ్.ఎన్.ఎస్.ఎస్ (Handri Neeva Sujala Sravanthi) ప్రాజెక్ట్ ప్రధానాంశాల వివరాలు.
- రాయలసీమలోని నాలుగు కరువు ప్రభావిత మాజీ జిల్లాలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
- హంద్రి–నీవా మెయిన్ కెనాల్, కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం సమీపంలోని శ్రీశైలం ఆనకట్ట జలాశయం నుంచి ప్రారంభమవుతుంది.
- 120 వరద రోజులలో 40 టీఎంసీల కృష్ణా వరదనీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన.
- మెయిన్ కెనాల్ వెంట 12 చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేశారు.
- సుమారు 6,02,500 ఎకరాలకు (2.438 లక్షల హెక్టార్లు) ఖరీఫ్ సాగునీరు, అలాగే 33 లక్షల మందికి (4 టీఎంసీలు) త్రాగునీటి సదుపాయం కల్పన.
- ముచ్చుమర్రి లిఫ్ట్ వద్ద రిజర్వాయరు లెవెల్ +244.700 మీటర్ల (+802.821 అడుగులు) వద్ద ఉన్నప్పుడు నీటిని తీసుకుంటారు.
- మెయిన్ కెనాల్ మొత్తం పొడవు 554.175 కి.మీ. — కర్నూలు జిల్లా మల్యాల నుండి అన్నమయ్య జిల్లాలోని అదవిపల్లె రిజర్వాయరు వరకు.
- గరిష్ట డిమాండ్ తీర్చడానికి 9.05 టీఎంసీల సామర్థ్యం గల 8 రిజర్వాయర్లు ప్రతిపాదించారు.
- ఈ ప్రాజెక్టుకు కావలసిన విద్యుత్ సుమారు 672 మెగావాట్లు.
ప్రాజెక్టు దశలు
- ఫేజ్–I: జీడిపల్లె రిజర్వాయరు వరకు (కిమీ 216.300) → 1,98,000 ఎకరాలకు సాగునీరు, 14 టీఎంసీలు.
- ఫేజ్–II: జీడిపల్లె నుంచి అదవిపల్లె రిజర్వాయరు వరకు (కిమీ 554.175) → 4,04,500 ఎకరాలకు సాగునీరు, 26 టీఎంసీలు.
- మెయిన్ కెనాల్‌పై రిజర్వాయర్లు
a) కృష్ణగిరి – 0.161 TMC
b) పాతికొండ – 1.126 TMC
c) జీడిపల్లె – 1.631 TMC
d) మరాల – 0.465 TMC
e) శ్రీ ఎం.ఆర్. శ్రీనివాసపురం – 1.020 TMC
f) అదవిపల్లె – 1.814 TMC
బ్రాంచ్ కెనాల్‌పై రిజర్వాయర్లు
- గోల్లపల్లె – 1.913 TMC (మడకశిర బ్రాంచ్ కెనాల్‌పై)
- చెర్లపల్లె – 1.608 TMC (పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌పై)
- బ్రాంచ్ కెనాళ్లు / డిస్ట్రిబ్యూటరీలు
- మడకశిర బ్రాంచ్ కెనాల్: 235.435 Km – 61,557 ఎకరాలు
- పేరూరు బ్రాంచ్ కెనాల్: 6.07 Km – 80,600 ఎకరాలు
- పుంగనూరు బ్రాంచ్ కెనాల్: 220 Km – 37,300 ఎకరాలు
- తంబళ్లపల్లె బ్రాంచ్ కెనాల్: 29.43 Km – 15,000 ఎకరాలు
- నీవా బ్రాంచ్ కెనాల్: 132.35 Km – 57,500 ఎకరాలు
- వాయలపాడు బ్రాంచ్ కెనాల్: 23.5 Km – 17,200 ఎకరాలు
- చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ: 42.30 Km – 22,400 ఎకరాలు
- ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటరీ: 25.17 Km – 15,400 ఎకరాలు
- సదుము డిస్ట్రిబ్యూటరీ: 39.28 Km – 5,400 ఎకరాలు
- పుంగనూరు బ్రాంచ్ కెనాల్
- మెయిన్ కెనాల్ @ కిమీ 400.500, పట్టణం గ్రామం, కదిరి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా నుండి ప్రారంభం.
- పొడవు: 220.350 Km.
- జ్యూరిస్డిక్షన్: గుద్దంపల్లె (అన్నమయ్య జిల్లా) నుండి కలగటూరు (చిత్తూరు జిల్లా) వరకు.
- డిశ్చార్జ్ :
- Km 75.075 → 10.800 క్యూమెక్స్ (381 క్యూసెక్స్)
- Km 137.325 → 8.100 క్యూమెక్స్ (353 క్యూసెక్స్)
- Km 189.800 → 4.110 క్యూమెక్స్ (145 క్యూసెక్స్)
- కుప్పం బ్రాంచ్ కెనాల్
పుంగనూరు బ్రాంచ్ కెనాల్ @ Km 207.800, అప్పినపల్లె, పెద్దపంజాణి మండలం, చిత్తూరు జిల్లా వద్ద ప్రారంభం. - 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరందించడం, 6,300 ఎకరాల సాగునీరు స్థిరీకరించడం, అలాగే పాలమనేరు & కుప్పం నియోజకవర్గాల 8 మండలాల్లో 4.02 లక్షల మందికి త్రాగునీరు అందించడం.
- పొడవు వివరాలు : 131.200/143.900 Km, 3 లిఫ్టులు ఏర్పాటు.
- కెనాల్ చివర పరమసముద్రం చెరువు (కుప్పం సమీపంలో)