Prakasam

ప్రకాశం ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్ బాధ్యతల స్వీకరణ

ప్రకాశం జిల్లా ఎస్పీ గా గరుడ్ సుమిత్ సునీల్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ (ఎస్ ఐబీ) నుంచి బదిలీపై వచ్చి ఎస్ పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా చూడటమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు. గరుడ్ సుమిత్ సునీల్ గతంలో ప్రకాశం జిల్లాలో ట్రైనీ ఐపీఎస్ గా పనిచేశారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *