29 జనసేన విస్తృత సమావేశం

  • పాల్గొననున్న పవన్ కళ్యాణ్ 
  • అక్టోబరు 2న శ్రమదానంపై చర్చ

జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని ఈనెల 29న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 29వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందనీ, అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతుల కోసం జనసేన నిర్వహించే శ్రమదానం కార్యక్రమం విధివిధానాలను నిర్ణయించనున్నట్టు పార్టీ కార్యాలయం తరపున పి.హరి ప్రసాద్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ పి.ఏ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నుంచి గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొననున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.