ఈ నెల 30 న విజయవాడకు పవన్ కళ్యాణ్

ఈ నెల 30 న విజయవాడకు పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో ముందుగా నిర్ణయించిన పర్యటనను వాయిదా వేసుకున్నారు.  30న  జనసేన శ్రేణులతో ఏర్పాటుచేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అక్టోబరు 1న ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించతలపెట్టిన శ్రమదానంపై చర్చించనున్నారు. గోదావరి జిల్లాల్లో ఏర్పాటుచేసిే శ్రమదానం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్టు సమాచారం. శ్రమదానం సందర్భంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రహదారి గోతులు పూడ్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published.