బాలినేనీ..ఖబడ్దార్..

మంత్రి బాలినేనిపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు..కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ బాలా వీరాజంనేయస్వామి ఇంటిపైకి కార్యకర్తలను దాడికి ఉసిగొల్పుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..బాలినేని రూ 1743 కోట్లు కొల్లగొట్టాడని స్వామి ఆరోపిస్తూ శుక్రవారం నాడు చిట్టా విడుదల చేశారు. దీనిపై బాలినేని అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే నిరూపించాలంటూ స్వామి ఇంటికిపైకి వెళ్లటంతో నారా లోకేష్  మీడియాకు ప్రకటన విడుదల చేశారు..ఆయన ఏమన్నారంటే..
‘‘హవాలా బాలినేనీ..నీ దాదాగిరీకి ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడింది..నీ అవినీతిని ప్రశ్నిస్తే విద్యావంతులు, దళిత మేధావి, కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి ఇంటిపైకి రౌడీ మూకల్ని పంపుతావా.. అవినీతి చీడపురుగువి నీకే అంత పౌరుషం పొడుచుకు వస్తే ..నీతికి నిలువుటద్దమైన స్వామి ఇంటిపైకి దాడికొచ్చిన మిమ్మల్నేం చేసినా పాపం లేదు. ప్రాణాలు తీసే కిల్లర్ గేంబ్లర్ బాలినేనీ..మా డాక్టర్ స్వామి జోలికొస్తే ఖబడ్దార్ అంటూ’’ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.