ap news

సామాజిక న్యాయ సాధన కోసం బహుజన వర్గాలు పోరాడాలి

ఎస్ సీ, ఎస్ టి, బీసీ రాష్ట్ర సదస్సు లో వివిధ సంఘాల నేతల పిలుపు

రాష్ట్రం లో సామాజిక న్యాయం లక్ష్యంగా బహుజనులు సమైక్య పోరాటానికి సన్నద్ధం కావాలని సీపీఐరాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో SC ST BC…రాష్ట్ర JAC కన్వీనర్ కొరివి వినయకుమార్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సమాలోచన సదస్సు లో రామకృష్ణ అతిథి గా పాల్గొని ప్రసంగించారు. సంక్షేమ, అభివృధి, రక్షణ, విద్యా, ఉపాధి రంగాలలో మెరుగైన అవకాశాలు ప్రజలకు అందించట0మ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని రామకృష్ణ విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ప్రజల భూములను కొల్లగొట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వివరించారు. రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా బలహీనపడుతుందని ఆయన విమర్శించారు అణగారిన వర్గాలు అన్ని రంగాలలో సమాన భాగస్వామ్యం కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.

సదస్సులో మాట్లాడుతున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాదరావు

దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వం 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు కొనసాగిస్తుందని, దళితుల పై అత్యాచారాలు పెరిగి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల రక్షణ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని వివరించారు. ప్రభుత్వాలు ప్రైవేటు రంగాలను ప్రోత్సహించటం వల్ల అణగారిన కులాల రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగాలలో సైతం రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు. తాడికొండ శాసన సభ్యుడు తెనాలి శ్రావణ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్దమైన పథకాలు, ప్రత్యేక చట్టాల పట్ల బహుజన వర్గాలలో చైతన్యం పెరగాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలు, అవకాశాలు అందుకునే స్థాయికి దళితులను సన్నద్ధం చేయాలని వివరించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యము, ఙ్ఞానము తో కూడిన ప్రత్యేక సంస్కృతిని పెంపొందించాలని, అప్పుడే సమాజం లో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందుతాయని వివరించారు. అణగారిన కులాలు, ముఖ్యంగా దళితులు ఐక్యంగా అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్ర సదస్సు లో మాజీ MLC జల్లి విల్సన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, RPI పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వర ప్రసాద్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ నాయకులు మేళం భాగ్య రావు, తోటి చెంగల్ రావు, వంగిపురపు రెడ్డన్న, అల్లాడి దేవకుమార్, చిట్టి బాబు, కె. సంధ్యారాణి, జామి రమాదేవి, తది తరులు పాల్గొని ప్రసంగించారు…….. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏* మేళం భాగ్య రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *