పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం
తూర్పుమధ్య అనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తరువాత 24 గంటలకు పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా బలోపేతం అవుతుంది.. ఎల్లుండి ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం..దీని ప్రభావంతో నేడు , రేపు చెదురుమదురుగా భారీ వర్షాలు
బుధ,గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ..సోమవారం అల్లూరి, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు .. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ..కోస్తా తీరం వెంబడి 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు .. ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుంది..మత్స్యాకారులు వేటకు వెళ్ళొద్దని సూచించారు.

