కాకుమాను రాజశేఖర్ ఇక లేరు

గుండెపోటుతో హైదరాబాద్ లో మృతి
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజకీయవర్గాలు
వైఎస్ఆర్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. వైసీపీ హయాంలో రాజశేఖర్ లీడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రాజశేఖర్ యువజన కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పని చేశారు. వైసీపీలో ఇపుడు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల ప్రకాశంలోని రాజకీయవర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఇన్ చార్జి చుండూరి రవిబాబు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాకుమాను మృతి చెందిన నేపథ్యంలో గురువారం నిర్వహించాల్సిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని వాయిదా వేశారు.
వైఎస్ జగన్ తీవ్ర సంతాపం
కాకుమాను రాజశేఖర్ మృతి పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని ప్రకటనలో తెలిపారు.
X లో జగన్ ట్వీట్

