ap news

శ్రీశైలంను దర్శించుకున్న ఎంపీలు

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఎంపీలు సుప్రియా సూలే, శ్రీకృష్ణదేవరాయలు

మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎంపీలకు శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు సాదర స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానానికి సంబంధించిన పలు అంశాలపై పరస్పరం మాట్లాడుకున్నారు.

శ్రీశైలం దర్శించకున్న ఎంపీలు లావు కృష్ణ దేవరాయలు, సుప్రియా సూలే.. చిత్రంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు

ఈ సందర్భంగా ఎంపీలు సుప్రియా సూలే, లావు శ్రీకృష్ణదేవరాయలు దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావును ప్రత్యేకంగా అభినందించారు. శ్రీశైలం క్షేత్ర దర్శనం అనంతరం ఎంపీలు ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *