నేడు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 14వ తేది సోమవారం ఉదయం 10‌‌:30 గం.లకు ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగే ఈకార్యక్రమంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్,జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ,జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు,జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి,జస్టిస్ రవి చీమలపాటి,జస్టిస్ వడ్డిబోయన సుజాత లతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Leave a Reply

Your email address will not be published.