ap news

‘నేను-తెలుగుదేశం’ పుస్తకం ఆవిష్కరణ

40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంపై పుస్తకం రాసిన కంభం పాటి
కార్యక్రమానికి హాజరైన వివిధ రంగాల ప్రముఖులు

టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన ‘నేను-తెలుగుదేశం’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం హైదరాబాదులో జరిగింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కాగా, తన పుస్తకంపై కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ… ఈ పుస్తకం కోసం రెండేళ్లు హోమ్ వర్క్ చేశానని వెల్లడించారు. ఎన్టీఆర్ ఏది చెబితే అది చేయడమే నాకు తెలుసు అని వివరించారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని కొనియాడారు. కాగా, ఈ పుస్తకావిష్కరణ సభలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీడీపీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు,చింతకాయల అయ్యన్నపాత్రుడు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, రాఘవేంద్రరావు, అశ్వనీదత్, తెరాస తుమ్మల నాగేశ్వరావు, సిపిఐ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్ర మూర్తి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతున్నచంద్రబాబునాయుడు

40 ఏళ్లుగా టీడీపీలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నా: కంభంపాటి రామ్మోహనరావు
హైదరాబాద్: 40 ఏళ్లుగా టీడీపీలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌ తెలిపారు. హోటల్ దస్పల్లాలో కంభంపాటి రామ్మోహనరావు రాసిన ‘‘నేను.. తెలుగుదేశం’’ పుస్తకావిష్కరించారు. ఈ సందర్భంగా కంభంపాటి రామ్మోహన్‌ మాట్లాడుతూ రెండేళ్లు కష్టపడి పుస్తకాన్ని రచించానని తెలిపారు. భావితరాలకు తన పుస్తకం ఉపయోగనపడాలని ఆకాంక్షించారు. రానున్న మహానాడు ద్వారా యువతరాన్ని.. పార్టీ వైపు తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరుతున్నానన్నారు.

‘‘40 ఏళ్లలో టీడీపీ అనేక ఆటుపోట్లు చూసిందని మాజీ డీజీపీ హెచ్‌జే దొర పేర్కొన్నారు. పాలనలో ఎన్టీఆర్, చంద్రబాబుది ఒక్కోశైలి. ఎన్టీఆర్ తీసుకున్న ఏ నిర్ణయమైనా అప్పట్లో సంచలనమే. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశాను. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లే సమయంలో ఎన్టీఆర్ క్రేజ్ చూసి అప్పటి కేంద్ర ప్రభుత్వం షాకైంది’’ అని హెచ్‌జే దొర వెల్లడించారు.

వేదికపై పుస్తకాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబునాయుడు
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *