నేడు నిరుద్యోగుల చలో అసెంబ్లీ
పిలుపునిచ్చిన తెలుగు యువత, టీ.ఎన్.ఎస్. ఎఫ్
మీడియాకు ప్రకటన విడుదల
ఎన్నికలకు ముందు 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడున్నరేళ్లు దాటినా ఉద్యోగాలు భర్తీ చేయకుండా బూటకపు మాటలతో కాలయాపన చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు, ఉపాధి లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి నిరుద్యోగులకు చేసిన మోసానికి నిరసనగా తెలుగు యువత, టి.ఎన్.ఎస్. ఎఫ్ మరియు రాష్ట్రంలోని అన్ని విధ్యార్ది, యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు (15.09.2022) ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని యువజన, విద్యార్ది సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. యువత తలచుకుంటే సాధించనిది అంటూ ఏదీ లేదు. అందరం కలిసి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చేలా వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దాం.