హైదర్ క్లబ్ లో టెన్నిస్ కోర్టు ప్రారంభం
ఒంగోలులోని హైదర్ క్లబ్ లో సింథటిక్ టెన్నిస్ కోర్టును జిల్లా కలెక్టర్ ఎ.ఎస్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టెన్నిస్ కోర్టులో కొద్దిసేపు ఆయన టెన్నిస్ ఆడారు. ఈ కార్యక్రమంలో హైదర్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సి. మాలకొండయ్య, కార్యదర్శి కె. వెంకటరెడ్డి తో పాటు ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.