తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఏర్పాటు

  • ప్రారంభించిన చంద్రబాబునాయుడు
  • అధ్యక్షురాలిగా తేజస్వి పొడపాటి

తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఏర్పాటయింది. ఈ వింగ్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ వింగ్ కు తేజస్వి ని పొడపాటిని అధ్యక్షురాలిగా నియమించారు. భావి ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తేజస్వి తెలుగు మహిళా నాయకురాలుగా కూడా ఉన్నారు. చంద్రబాబునాయుడుతో శనివారం భేటీ అయిన ఆమె తెలుగు ప్రొఫెషనల్ వింగ్ విధి విధానాలపై చర్చించారు. ఈ సందర్బంగా తేజస్వి పొడపాటి మాట్లాడుతూ నేటి యువత తమ తమ హక్కుల కోసం భావితరాల ఉజ్వలభవిత కోసం రాజకీయాలను వేదిక చేసుకోవాలన్నారు. చంద్రబాబు హయాంలో ఎంతో మంది ఐటి అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి చేరుకున్నారనీ, ఇపుడా దార్శనికత కరువై యువత అయోమయాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రొఫెషనల్స్ కు తమ సమయానుకూలంగా రాష్ట్ర అభ్యున్నతికై పోరాడటానికి తెలుగు ప్రొఫెషనల్ వింగ్ తోడ్పాడునిస్తుందన్నారు. మేధావులు, సమర్థులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో లో తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ప్రధాన కార్యదర్శులు గడ్డం మహేంద్ర, కనకమేడల వీరాంజనేయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.