భువనేశ్వరికి వంశీ క్షమాపణ

ఎమోషనల్ లో తప్పుగా దొర్లింది 
కులం నుంచి వెలేస్తారని కాదు..
మనస్ఫూర్తిగానే క్షమాపణలు
టీవీ చానల్ డిబేట్ లో వంశీ

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. ఇటీవల భువనేశ్వరిపై వంశీ వివాదాస్పదమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బుధవారం (01.12.21) ఒక టీవీ చానల్ డిటేట్ లో పాల్గొన్న వంశీ భువనేశ్వరికి క్షమాపణ చెప్పారు. ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవం .. నా వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నా.. టీడీపీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి .. భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా – కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు.. నేను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నా .. చంద్రబాబును కూడా క్షమాపణ కోరుతున్నా అని వంశీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.