పవన్ కళ్యాణ్ చాలెంజ్..స్వీకరించిన బాలినేని

చేనేత వస్త్రాలు ధరించి 

ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మాజీ మంత్రి 

రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ 

చేనేత వస్త్రాలను ధరించి ఫేస్ బుక్ లో బాలినేని పోస్ట్ చేసిన ఫొటో

చేనేత వస్త్రాలు ధరించాలంటూ పవన్ కళ్యాణ్ విసిరిన చాలెంజ్ ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. చేనేత వస్త్రాలను ధరించి ఫొటోలను తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ మంత్రి కెటిఆర్ విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన పవన్ కళ్యాణ్ తాను కూడా బాలినేనితో పాటు మరికొందరికి చాలెంజ్ విసిరారు. ఆ చాలెంజ్ ను బాలినేని స్పోర్టివ్ గా తీసుకుని చేనేత వస్త్రాలను ధరించారు. కెటిఆర్ కూ, పవన్ కు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఏపీలో వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్ధి పార్టీలో కీలక నేత అయిన బాలినేనికి చాలెంజ్ విసరటం, బాలినేని కూడా ఆ చాలెంజ్ ను స్వీకరించటం వైరల్ గా మారింది. బాలినేని పవన్ కళ్యాణ్ చాలెంజ్ ను స్వీకరిస్తున్నట్టు ఫేస్ బుక్ లో చెబుతూ.. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు ఇపుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

చేనేత వస్త్రాలను ధరించి ఫేస్ బుక్ లో బాలినేని పోస్ట్ చేసిన ఫొటో
SHARE THIS NEWS

Leave a Reply

Your email address will not be published.