ఎమ్మెల్యే ఆర్కేకు స్వల్ప అస్వస్థత.
విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఎమ్మెల్యే ఆర్ కె మంగళగిరి – తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం నరసింహ స్వామి ఆలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. సాయంత్రం పెదకాకాని తన నివాసానికి బయలుదేరిన ఎమ్మెల్యే ఆర్కే కు స్వల్పంగా ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్కే కు సూచించారు.