Literature

సత్తివాడ సత్యాలు పుస్తకావిష్కరణ

సామాజిక నిర్దేశనం చేసేది సాహిత్యమేనని బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. శనివారం సాయంత్రం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ప్రముఖ కవి సత్తివాడ శ్రీకాంత్ రచించిన ” సత్తివాడ సత్యాలు” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్తివాడ సత్యాలు పుస్తకం ద్వారా కవి సత్తివాడ శ్రీకాంత్ చాలా విషయాలను విశదీకరించారని కొనియాడారు. ఈ పుస్తకంలో ఎన్నో జీవిత సత్యాలను తన కలం ద్వారా పొందుపరిచి చాలా మందిని ఆలోచింప జేశారని పేర్కొన్నారు. ఈ పుస్తకం తప్పకుండా అందరూ చదవాలని కోరారు. మరో అతిథి సింహాచలం దేవస్థానం ప్రత్యేక అహ్వానితులు ,,వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు, అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కవి శ్రీకాంత్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. కవిగా, రచయితగా, షార్ట్ ఫిలిం మేకర్ గా, గేయరచయితగా రానిస్తూ తన కలం ద్వారా పలు అద్భుతాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మరో అతిథి ప్రముఖ రచయిత డాక్టర్ డివి సూర్యారావు మాట్లాడుతూ సత్తివాడ శ్రీకాంత్ కు తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. తాను ఏ కార్యక్రమం నిర్వహించిన తనను తప్పకుండా ఆహ్వానిస్తారని తెలిపారు. తన కలం ఎన్నో అద్భుతాలను సృష్టించిందని అన్నారు. అంశం ఏదైనా సరే దాని పై అవలీలగా కవితలు రాయడంలో శ్రీకాంత్ దిట్టని కొనియాడారు. అతనికి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. సత్తివాడ సత్యాలు పుస్తకం అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. కవి సత్తివాడ శ్రీకాంత్ మాట్లాడుతూ తన ప్రతి రచన సమాజ హితం కోరే ఉంటుందని పేర్కొన్నారు.నాలుగు మంచి విషయాలను నలుగురికి తెలియచేయడం కోసం ఎప్పుడు ఆరాటపడుతుంటానని అన్నారు. తన రచనలలో అవి ప్రస్పుటంగా కనిపిస్తాయని అన్నారు.సత్తివాడ సత్యాలు పుస్తకంలో కూడా చాలా మంచి విషయాలను ప్రస్తావించినట్లు చెప్పారు. ఈ పుస్తకం తప్పకుండా అందరిని ఆలోజింపజేస్తుందని చెప్పారు. తన ప్రస్థానంలో నా వెంట ఉన్న నా కుటుంబ సభ్యులు, మిత్రులు ,శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ,జిల్లా కేంద్ర గ్రంధాలయం చైర్ పెర్సన్ కొండా రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *