చైనాను వణికిస్తున్న కరోనా
ప్రపంచంలో మళ్ళీ కరోనా భయం ప్రారంభమవుతోంది. చైనాలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావటమే దీనికి ప్రధాన కారణం. రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయనీ, మృతుల సంఖ్య కూడా అధికంగా ఉందని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ ట్వీట్ చేశారు. రానున్న మూడు నెలల్లో కరోనా విజృంభణ భయంకరంగా ఉంటుంది..చైనాలో 60 శాతం మందీ, ప్రపంచ జనాభాలో 10 శాతం కరోనా బారిన పడతారని అంటు వ్యాధి నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో కరోనా ఆంక్షలు సడలించిన తరువాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందినట్టు వార్తలొస్తున్నాయి.