ap news

సిఎం జగన్ రాయలసీమ ద్రోహి : ధ్వజమెత్తిన చంద్రబాబు

మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్

జగన్ పోవాలి..సీమలో సిరులు పండాలి
ఒక్క జీవోతో సీమలో 102 ప్రాజెక్టుల పనులు రద్దు చేశాడు

సీమ ప్రాజెక్టులపై 5 ఏళ్లలో టీడీపీ ఖర్చు..రూ. 12,411 కోట్లు….వైసీపీ ఖర్చు రూ. 2011 కోట్లు

సీమలో మేం కులం చూడలేదు…కరువు చూశాం

సీమ ప్రాజెక్టులపై ఖర్చు కంటే….సొంత పత్రిక ప్రకటనల ఖర్చు, సలహాదారుల జీతాల మొత్తమే ఎక్కువ

చేసిన ద్రోహానికి రాయలసీమ రైతాంతాగానికి జగన్ క్షమాపణ చెప్పాలి

జగన్ పోవాలి….సీమ లో సిరులు పండాలి!

రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మీడియా సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు

 • అమరావతి, ఆంధ్రావని న్యూస్ :  రాష్ట్రంలో రాయలసీమ తీవ్ర నీటి ఎద్దడి ఉంటుంది. ఈ కారణంగా సీమ నీటికష్టాలు తీర్చ డానికి ఎన్.టీ.రామారావు తెలుగుగంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. కృష్ణా మిగులు జలాలను కరువుప్రాంతానికి అందించడంకోసం, నలుగురు ముఖ్యమం త్రులను కన్విన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్ తో తమిళనాడుకు కూడా తాగునీరు అందించా రు. తెలుగుగంగ తర్వాత గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టులతో మొత్తం రాయలసీమ ను సస్యశ్యామలం చేయాలని ఎన్.టీ.ఆర్ తలచారు. నేను వచ్చాక పట్టిసీమ నిర్మించి, కృష్ణా జలాలను సీమకు అందించాను. దేశమంతా ఆలోచిస్తున్న నదుల అనుసంధానం ప్రాజెక్ట్ లో ఇదొక తొలిఅడుగు. నదుల అనుసంధానం చేయగలగితే రాష్ట్రంలో ప్రతిఎకరాకు నీరుఇవ్వవచ్చని ఆలోచించి దానికి అను గుణంగా ఒక బ్లూ ప్రింట్ తయారుచేశాము.
  గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులతోకలిపి మొత్తం రాష్ట్రంలో చిన్నవి పెద్దవి 69 నదులు ఉన్నాయి. గోదావరిపై నిర్మించిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే, ఆ నీటిని నేరుగా వివిధ మార్గాల్లో ఇచ్ఛాపురం వరకు అందించేలా ప్రణాళికలు వేశాం. అదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్.
  మరోపక్క పోలవరం కుడికాలువద్వారా ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించి, శ్రీశైలంలోని కృష్ణా నీటిని రాయలసీమకు తరలించేలా ప్రణాళికలు తయారుచేశాం.
  ఇంకోపక్కన ప్రకాశం బ్యారేజీ కి వచ్చే కృష్ణానీటిని వైకుంఠపురంలో ఒక బ్యారేజీ కట్టి, అక్కడినుంచి పల్నాడుజిల్లా నకరికల్లులోని నాగార్జున సాగర్ కుడికాలువకు కలపాలని ఆలోచించాము. దీనికి సంబంధించిన పనులకు టెండర్లు కూడా పిలవడం జరిగిం ది. అదేసమయంలో బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి, నల్లమల ఫారెస్ట్ లో ఒక 35 కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తే, గోదావరి నీరు నేరుగా పెన్నానదికి వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా రాయలసీమలోని అన్నిరిజర్వాయర్లకు కేంద్రబిందువైన బనకచర్ల రిజర్వాయర్ కు నీటిని తరలిస్తే, అక్కడినుంచి కండలేరు, సోమశిలవరకు నీటిని పంపవచ్చు. ఈ మొత్తం ప్రణాళికతో నదుల అనుసంధానం మొత్తం పూర్తవుతుంది. ఈ విధమైన ఆలోచన, దూరదృష్టితో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఆలోచించాను.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ ఐదేళ్లలో రూ.68,293కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ నాలుగేళ్లలో రూ.22,165 కోట్లు మాత్రమే వెచ్చించింది. మా ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2014-19లో రూ. 68,293కోట్లు ఖర్చుపెట్టింది. ఈ ప్రభుత్వం రూ.22,165కోట్లు ఖర్చుపెట్టింది. మొత్తం బడ్జెట్లో టీడీపీప్రభుత్వం 9.63శాతం నిధుల్ని సాగునీటి రంగానికి ఖర్చుపెడితే, ఈ ప్రభుత్వం 2.35శాతమే ఖర్చుపెట్టింది. ఆ నిధులు పనులు చేయడానికి కాదు.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్ట్ సంస్థలకు దోచి పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత ఈ ముఖ్యమంత్రికి తెలియదు. నాటకాలు ఆడాడు. మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడు తూ, గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొస్తానని ప్రగల్భాలు పలికాడు. తెలంగాణ ముఖ్య మంత్రి ఒప్పుకున్నాడని గొప్పలు చెప్పాడు. అప్పుడే చెప్పాను మీఆలోచనలు సాధ్యం కావని, తెలుగుగంగ అనుభవంతో ఏం చేయాలో అది చేయండని.

 • టీడీపీప్రభుత్వంలో సాగునీటిరంగానికి జరిగిన కేటాయింపులు. వెచ్చించిన నిధులు
  2014-15 లో 3,017.5కోట్లు కేటాయించాం. 9,223.75కోట్లు ఖర్చుపెట్టాం.
  2015-16లో 4,500.79 కోట్లు కేటాయించి, 9,545.87 కోట్లు ఖర్చుచేశాం.
  2016-17లో 7,205.82 కోట్లు కేటాయించి, 10,561.68కోట్లు వెచ్చించాము.
  2017-18లో 11,870 కోట్ల కేటాయింపులు జరిగితే, 12,100.28కోట్లు ఖర్చుపెట్టాం
  2018-19లో 16,978 కోట్లు కేటాయించి, 14,4632.13కోట్లు ఖర్చు పెట్టాం.
  బడ్జెట్లో పెట్టింది రూ.43,572కోట్లు అయితే ఖర్చుపెట్టింది రూ.55,893.71కోట్లు. అదీ తెలుగుదేశం ప్రభుత్వ చిత్తశుద్ధి. అదనంగా నీరు-ప్రగతి కార్యక్రమం కింద 12,400.23 కోట్లు ఖర్చు పెట్టాము.
  మొత్తంగా ఐదేళ్లలో సాగునీటిరంగానికి, నీటివనరుల పెంపునకు రూ.68,293.94 కోట్లు ఖర్చుపెట్టాము.
  జగన్ రెడ్డి హయాంలో చేసిన కేటాయింపులు, పెట్టిన ఖర్చు
  2019-20లో 13,139.05కోట్లు కేటాయించి, 4,730కోట్లు ఖర్చుపెట్టారు.
  2020-21లో 11,805కోట్లు కేటాయించి, 6,165కోట్లు వెచ్చించారు.
  2021-22లో 12,431 కోట్లు కేటాయిస్తే, 6,750కోట్లు ఖర్చుపెట్టారు.
  2022-23లో 11,482.37 కోట్లు కేటాయించి, 3,506కోట్లు ఖర్చుపెట్టారు.
  నాలుగేళ్లలో చచ్చీచెడీ నీరు-చెట్టు కింద రూ.1014కోట్లు ఖర్చుపెట్టారు.
  మొత్తం కలిపినా రూ.22,165కోట్లు మాత్రమే. టీడీపీప్రభుత్వం పెట్టిన రూ.68వేలకోట్లు ఎక్కడ.. రూ.22వేలకోట్లు ఎక్కడ? ఇలా అరకొరగా ఖర్చుపెడితే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయి?
  రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం, వైసీపీ చేసినఖర్చు

మొత్తం సాగునీటిరంగానికి పెట్టిన ఖర్చుతో పాటు తమహయాంలో రాయలసీమలోని ప్రాజెక్టులకు ఎంతఖర్చుపెట్టామో కూడా చూద్దాం.

 • రాయలసీమలోని నాలుగుజిల్లాలకు 2014-19లో రూ.8,291కోట్లు ఖర్చుపెట్టాము.
  నీరు ప్రగతి కార్యక్రమం కింద రూ.4,150కోట్లు, మొత్తం కలిపి ఐదేళ్లలో మేము రూ12,441 కోట్లు ఖర్చు పెట్టాం.
  వైసీపీప్రభుత్వం 2019-23 మధ్యన కేవలం రూ.2,011కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. రాయలసీమకు ఇంతతక్కువ ఖర్చుపెట్టిన మీరు సీమద్రోహులుకాదా? సీమవాసుల నీటి కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మీకులేదా? రాయలసీమను రతనాలసీమను చేస్తా మన్న హామీని కొంతవరకు మేం అమలుచేశాం. మరలా అధికారంలోకి వచ్చి ఉంటే, అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసేవాళ్లం.
  తెలుగుగంగ పరిస్థితి ఇది..
  రాయలసీమకు సాగునీటిని అందించే అతిముఖ్యమైన తెలుగుగంగ ప్రాజెక్ట్ నిర్మాణాని కి టీడీపీప్రభుత్వం 2014-19 లో రూ.504కోట్లు ఖర్చుపెడితే, వైసీపీప్రభుత్వం రూ.383 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ నాలుగేళ్లలో అదనపు ఆయకట్టు పెంచడానికి ఎలాం టి చర్యలుతీసుకోలేదు. మొత్తం ప్రాజెక్ట్ 2020నాటికి పూర్తిచేస్తామన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు.
  హంద్రీనీవా సంగతి 
  మొత్తం ఆయకట్టు 5,33,417 ఎకరాలు. టీడీపీప్రభుత్వంలో పెట్టిన ఖర్చు రూ.4,182 కోట్లు. వైసీపీప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.515కోట్లు. టీడీపీహాయాంలో ఫేజ్ -1 కింద 84శాతం పనులుజరిగితే, ఫేజ్-2లో 75శాతం పనులుజరిగాయి. ఈ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్ట్ ని 2020 జూన్ నాటికి పూర్తిచేస్తామని ప్రగల్బాలు పలికింది. ఇంత వర కు ఏమీపూర్తికాలేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కర్నూలులోని పత్తికొండ, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని తరలించవచ్చు. హంద్రీనీవా నుంచి పెన్నా అహోబిలం రిజర్వాయర్ కు , మిడ్ పెన్నా రిజర్వాయర్ కు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్, సర్వాయసాగర్, మల్లెమడుగు, చిత్తూరు వరకు నీటిని తరలించవచ్చు
  అదే హంద్రీనీవానుంచి జీడిపల్లి రిజర్వాయర్ కు, అక్కడినుంచి భైరవానితిప్ప, ఎగువ పెన్నా పేరూరు, అక్కడినుంచి చిత్తూరులోని గొల్లపల్లి రిజర్వాయర్ కు, మడకసిరకు తరలించవచ్చు. మడకసిర బ్రాంచ్ కెనాల్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీటిని తరలించవచ్చు. మా ప్రభుత్వంలో గొల్లపల్లి రిజర్వాయర్ కు నీటిని తరలించబట్టే, అక్కడ కియాపరిశ్రమ వచ్చింది. మారాలప్రాజెక్ట్ పూర్తిచేసి, కుప్పం, రామకుప్పం వరకు నీటిని తరలించాము. గండికోట ప్రాజెక్ట్ కోసం భూసేకరణ చేసి, పులివెందులకు నీళ్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వం కొద్దిపాటి పనులు చేయలేకపోయిం ది. హంద్రీనీవా మొత్తం పూర్తయితే, అనంతపురం, చిత్తూరుజిల్లాలు సస్యశ్యామలం అయ్యేవి. రెండుజిల్లాలకు నీటివసతి పెరిగితే చెన్నై, బెంగుళూరు నుంచి పరిశ్రమలు వచ్చేవి.
  మడకశిర బ్రాంచ్ కెనాల్
  మడకశిర బ్రాంచ్ కెనాల్ కింద మొత్తం ఆయకట్టు 40వేల ఎకరాలు. టీడీపీప్రభుత్వం రూ.806కోట్లు ఖర్చుపెట్టింది. వైసీపీప్రభుత్వం రూపాయిపెట్టలేదు. ప్రాజెక్ట్ నిర్వహణనే గాలికి వదిలేశారు.
  వేదవతి ప్రాజెక్ట్ పరిస్థితి
  ఆయకట్టు విస్తీర్ణం : 80వేల ఎకరాలు. టీడీపీ హాయాంలో రూ.1942 కోట్లపనులకు టెండర్లు పిలిచాము. వైసీపీప్రభుత్వం వచ్చాక టీడీపీహాయాంలో జరిగిన పనులకు పైసాఇవ్వలేదు. వేదవతి ప్రాజెక్ట్ కరువునివారణ ప్రాజెక్ట్. ఇది పూర్తయితే ఆలూరు పత్తి కొండ నియోజకవర్గాలకు నీళ్లు అందేవి.
  గాలేరు నగరి ఫేజ్-1, ఫేజ్ -2 పరిస్థితి
  మొత్తం ఆయకట్టు 2,58,500ఎకరాలు, టీడీపీప్రభుత్వంలో రూ.1546కోట్లు ఖర్చుపె ట్టాం. వైసీపీప్రభుత్వం రూ.443.43కోట్లు ఖర్చుపెట్టింది. టీడీపీహాయాంలో ఫేజ్ -1 లో 1.84శాతం పనులు పూర్తయితే, ఫేజ్-2లో 2.26శాతం పూర్తిచేశాం. మిగిలిన పనుల్ని 2020 జూన్ నాటికి పూర్తిచేస్తామని ప్రగల్భాలుపలికిన వైసీపీప్రభుత్వం ఎక్కడిపనులు ఆక్క డే ఆపేసింది. గాలేరునగరి ప్రాజెక్ట్ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్ కు, అక్కడినుంచి ఎస్.ఆర్.బీ.సీ రిజర్వాయర్ నుంచి గోరుకల్లు అక్కడినుంచి ఎస్.ఆర్.బీ.సీ బైపాస్ మీ దుగా అవుకు రిజర్వాయర్ కు , అక్కడ టన్నెల్ తవ్వి గండికోటకు నీటిని తరలించా ము. అక్కడి నుంచి వామికుంట, సర్వారాయసాగర్ వరకు వెళ్లి ఆగిపోయింది. ఈ పనులకోసం ఈ ప్రభుత్వం రూపాయి ఖర్చుపెట్టలేదు.
 • ఎస్.ఆర్.బీ.సీ రిజర్వాయర్
  మొత్తం ఆయకట్టు 36,064ఎకరాలు, టీడీపీహాయాంలో రూ.282కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ వచ్చాక రూ.44కోట్లు వెచ్చించింది. టీడీపీప్రభుత్వంలో 93శాతం పనులు పూర్త య్యాయి. ఈ ప్రభుత్వానికి 7శాతం పనులు చేయడానికి నాలుగేళ్లు సరిపోలేదు.
  గండికోట ఎత్తిపోతల పథకం
  మొత్తం ఆయకట్టు 20,750 ఎకరాలు, టీడీపీప్రభుత్వం రూ.92కోట్లు ఖర్చుపెట్టి, 96శా తం పనులుపూర్తిచేసింది. వైసీపీప్రభుత్వం రూ.44కోట్లు ఖర్చుచేసింది. కానీ మిగిలిన 4 శాతం పనులు నేటికీ పూర్తికాలేదు. పెట్టినఖర్చు అంతా కాంట్రాక్టర్లకే.
  ఏ.బీ.ఆర్. ఫేజ్ -2
  మొత్తం ఆయకట్టు 42,600ఎకరాలు. టీడీపీప్రభుత్వం రూ.411కోట్లుఖర్చుపెట్టి, 65శా తం పనులు పూర్తిచేసింది. వైసీపీప్రభుత్వం 2020జూన్ నాటికి మొత్తం పూర్తిచేస్తామని చెప్పింది. రూ.42కోట్లుఖర్చుపెట్టినా, ఎక్కడా ఎలాంటిపనులు జరగలేదు.
  సోమశిల
  మొత్తం ఆయకట్టు 38,406 ఎకరాలు. టీడీపీప్రభుత్వం రూ.380కోట్లు ఖర్చుపెట్టి, 61 శాతం పనులుచేసింది. వైసీపీప్రభుత్వం రూ.253కోట్లు ఖర్చుపెట్టింది. మిగిలిన పనులు 2020 జూన్ నాటికి మొత్తంప్రాజెక్ట్ పూర్తిచేస్తామన్నారు. కానీ ఇంతవరకు చెప్పింది జరగలేదు.
  సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్
  దీని నిర్మాణం ఎందుకంటే చిత్తూరుజిల్లాలోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరందించ డానికి చేపట్టడం జరిగింది. దీనికింద మొత్తం ఆయకట్టు 13వేల ఎకరాలు.
  టీడీపీప్రభుత్వంలో రూ.134కోట్లు ఖర్చుపెట్టి, 70శాతంపనులు పూర్తిచేశాము. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.18కోట్లుఖర్చుపెట్టి, మిగిలిన పనుల్లో ఒక్కశాతం చేయలేదు.
  సోమశిల హై లెవల్ కెనాల్ ఫేజ్-1
  మొత్తం ఆయకట్టు 46,453ఎకరాలు. టీడీపీప్రభుత్వంలో రూ.521కోట్లు ఖర్చుపెట్టాం. వీళ్లు వచ్చాక 78కోట్లు ఖర్చుపెట్టారు. పనులేమీ జరగలేదు. గతప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఆపేశారు.డబ్బులు అడిగినవారిని కేసులతో వేధిస్తున్నారు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తున్న చంద్రబాబునాయుడు
 • ముచ్చుమర్రి
  రాయలసీమకు తాగునీరు అందించడానికి చేపట్టిన ప్రాజెక్ట్. మొత్తం ఆయకట్టు 90వేల ఎకరాలు. టీడీపీప్రభుత్వం రూ.549కోట్లు ఖర్చుపెట్టింది. వైసీపీ కేవలం రూ.5కోట్లతో సరిపెట్టి, ప్రాజెక్ట్ నిర్వహణను పూర్తిగా పక్కనపెట్టింది. చిన్నచిన్న మరమ్మతులు కూడా పట్టించుకోకుండా నిధులు లేవని కుంటిసాకులు చెబుతోంది.
  రాజోలిబండ డైవర్షన్
  మొత్తం ఆయకట్టు 40వేల ఎకరాలు. టీడీపీహాయాంలో రూ.1986కోట్లకు టెండర్లు పిలి చాము. వైసీపీప్రభుత్వం ఆ టెండర్లు రద్దుచేసింది. పనులు వదిలేసి కాంట్రాక్ట్ సంస్థ వెళ్లి పోయింది.
  సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్
  టీడీపీప్రభుత్వంలో రూ.37కోట్లు ఖర్చుపెట్టి, 67శాతం పనులు పూర్తిచేసి, మొత్తం ఆయకట్టులోని 2,300ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. వైసీపీప్రభుత్వం వచ్చాక రూ.16కోట్లు ఖర్చుపెట్టింది. కానీ ఎలాంటిపనులు జరగలేదు. టీడీపీహాయాంలో మొదలైన కాలువ ల తవ్వకాన్ని కూడా పూర్తిచేయలేకపోయారు.
  హెచ్.ఎల్.సీ ఆధునికీకరణ.
  మొత్తం ఆయకట్టు 62వేల ఎకరాలు. టీడీపీప్రభుత్వంలో రూ.270కోట్లుఖర్చుపెట్టాం. వైసీపీ పైసా ఖర్చుపెట్టలేదు. నాలుగేళ్లలో అంగుళం పనిపూర్తికాలేదు. తుంగభద్ర నుంచి వచ్చే నీటికి కాలువలులేకపోతే, వాటిని పూర్తిచేసి లైనింగ్ చేయించాము.
  భైరవాని తిప్ప పేరూరు ప్రాజెక్ట్
  మొత్తం ఆయకట్టు 23,500ఎకరాలు. టీడీపీ హాయాంలో రూ.1340కోట్లు కేటాయించి, భూసేకరణపూర్తిచేసి రూ.200కోట్లు ఖర్చుపెట్టాం. వైసీపీప్రభుత్వం వచ్చాక జరుగుతు న్న పనులను ఆపేయించింది. గతంలోచేసిన పనుల్ని కూడా నాశనంచేసింది. ఇది పూర్తయితే అనంతపురంజిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గానికి నీళ్లు అందుతాయి.
  ప్రాజెక్టులు పూర్తిచేయకపోతే చేయలేదు..కనీసం అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల్ని కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ప్రాజెక్టుల్లోని ఇసుక, కాలువల్లోని మట్టిని అమ్ముకుంటున్నారు. పాలకుల ఇసుకదోపిడీకి అన్నమయ్యప్రాజెక్ట్ కొట్టుకుపోతే, 60 మంది జలసమాధి అయ్యారు. మేం వెళ్లి బాధితుల్ని పరామర్శించి, ఎన్టీఆర్ ట్రస్ట్, పార్టీ తరుపున ఆర్థికసహాయం అందించాము. ఈ ప్రభుత్వం కనీసం వారిముఖం చూడలేదు . అలానే పింఛా ప్రాజెక్ట్ ను నాశనంచేశారు.
  ప్రాజెక్టులు నిర్మించరు.వాటినిర్వహణ పట్టించుకోరు గానీ వాటిని తాకట్టుపెట్టి అప్పులు తీసుకొస్తారు. రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, రూ. 23 ప్రాజెక్ట్ లకు రూ.35వేలకోట్లకు టెండర్లు పిలిచారు. ఈ వ్యవహారమంతా పెద్ద దోపిడీ
  రాయలసీమలోని 102 ప్రాజెక్టుల్ని ప్రీక్లోజర్ చేసిన జగన్ సీమద్రోహి?
  ఈప్రభుత్వం 198 ప్రాజెక్ట్ లకు సంబంధించిన టెండర్లు మొత్తాన్ని ప్రీక్లోజర్ చేసింది. వీటిలో ప్రధానంగా కర్నూల్లో 9ప్రాజెక్టులు, చిత్తూరులో 29, కడపలో 14, అనంతపు రంలో 38, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 16ఉన్నాయి. మొత్తం రాయలసీమలోని 102 ప్రాజెక్టుల పనులు ఆపేసి, కాంట్రాక్ట్ సంస్థలకు బ్యాంక్ గ్యారంటీలు వెనక్కు ఇచ్చేశారు. సీమ ప్రాజెక్టుల పనులు ఆపేసిన వాడు రాయలసీమద్రోహి కాక రక్షకుడు అవుతాడా?
  ఏ ప్రాజెక్టులు ప్రజలకు అవసరమో వాటిని పూర్తిచేయరు. తనకు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు మాత్రం అవసరంలేకపోయినా పనులు అప్పగిస్తాడు. గుండ్లకమ్మ ఏమైం ది? పులిచింతల గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి? సుంకేశుల ప్రాజెక్ట్ పరిస్థితి ఏమి టి?
  నేడు రాయలసీమప్రాజెక్టుల దుస్థితిని ప్రజలముందు ఉంచాను. రేపు ఆంధ్రా ప్రాజెక్టుల తో పాటు పోలవరం దుస్థితిని తెలియచేస్తాను. వైసీపీప్రభుత్వ దుర్మార్గాలపై ప్రజలంద రూ ఆలోచించాలి.
 • రాష్ట్రచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం జగన్ రాయలసీమకు చేశాడు.
  జగన్ రెడ్డి ముమ్మాటికీ రాయలసీమ ద్రోహి అనడానికి ఆ ప్రాంతంలోని ప్రాజెక్టుల్లో నాలుగేళ్లలో జరిగిన పనులే నిదర్శనం. రాష్ట్రచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం, అన్యాయం జగన్ రాయలసీమకు చేశాడు. జగన్ పోవాలి.. సీమలో సిరులు పండాలి. అదే నిజం. ఒళ్లు చించుకొని నోటికొచ్చినట్టు మాట్లాడటంకాదు. సీమకు చేసిన అన్యాయంపై సమాధానంచెప్పండి. కరువుప్రాంతాన్ని కరువుప్రాంతంగా చూడ కుండా, కులాలు మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రాజేస్తున్నారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారుచేసేలా ఒక ప్రణాళి క ప్రకటించారు. అవకాశాల గని అయిన రాయలసీమను అభివృద్ధిచేస్తే రాష్ట్రం రూపు రేఖలే మారిపోతాయి. గతంలో నీటికోసం తలెత్తిన సమస్యల్ని చాలావరకు పరిష్కరించాము.
  5 కోట్లప్రజల తరుపున అడిగిన ప్రశ్నలకు సమాధానంచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
  బూతులు మాట్లాడకుండా 5 కోట్ల ప్రజలతరుపున అడిగినవాటికి సమాధానంచెప్పండి. బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే సమాధానంచెబుతుంది. స్పందించకపోతే అభివృద్ధి వ్యతిరేకమైన ఈప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలంతా సిద్ధంకావాలి. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే రాయలసీమలోని అన్నిప్రాజెక్టుల్ని నదుల అనుసంధా నంలో భాగంగా పూర్తిచేసి, ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం. జగన్ ప్రీక్లోజర్ చేసిన 102 ప్రాజెక్టు ల్ని అవన్నీ మరలా ఓపెన్ చేసి, అన్నీ పూర్తిచేస్తాం.
  విలేకరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు స్పందన…
  రాష్ట్రంలో మొత్తం 64 ప్రాజెక్టులు ఉంటే, టీడీపీప్రభుత్వమే 24 పూర్తిచేసింది. రాయలసీ మకు ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలాకీలకం. ఒకప్పుడు నీళ్లులేక, మేతలేక పశువుల్ని కాపాటానికి ప్రత్యేక క్యాంపులు పెట్టాము. అటువంటి పరిస్థితిని చాలా వరకు మార్చా ము. టీడీపీప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు 12,441కోట్లు ఖర్చుపెడితే, వీళ్లు రూ. 2,011 కోట్లు ఖర్చుపెట్టారు. సీమకు ఇంత అన్యాయంచేసినందుకు సిగ్గుతో తలవంచు కొని రాయలసీమవాసులకు, రైతాంగానికి, యువతకు క్షమాపణలు చెప్పాలి. చేతగాకపోతే దిగిపోవాలి తప్పఇలా ద్రోహం చేయడం సరికాదు. ఇప్పటికీ ప్రాంతం కులం పేరుచెప్పుకొని బతికేవారు అక్కడున్నారు. రాయలసీమలో బతకాలని, భవిష్య త్ ఉంటుందని అక్కడి ప్రజలకు భరోసా కల్పించింది తెలుగుదేశం పార్టీనే. తెలుగు గంగ ను, పట్టిసీమను పూర్తిచేయకుండా అడ్డుకున్నారు. అవహేళన చేశారు. కానీ ఏమీ లెక్కచేయకుండా తెలుగుదేశం ప్రజలకోసం అనుకున్నది చేసిచూపించింది.
  ఎగువభద్ర, ఆల్మట్టి ఎత్తుపెంచితే, ఎల్.ఎల్.సీ, హెచ్.ఎల్.సీ, రాజోలిబండకు నీళ్లు రా వు. ఆఖరికి కృష్ణానదికి నీళ్లురావు. దానికి ప్రత్యామ్నాయంగా పోలవరం పూర్తిచేసి, ఆ నీటిని సీమకు తరలిస్తే, చాలావరకు సమస్యలు లేకుండా పోయేవి. రాష్ట్రంలో తుఫాన్లు నిరోధించలేము కానీ, కరువుని నివారించవచ్చు. దానికోసమే నదుల అనుసంధానం చేయడానికి ఉపక్రమించాను.

 • ప్రాజెక్టుల పనులు వేగంగా జరగగానికి రాత్రిళ్లు అక్కడే ఉన్నాను. అధికారుల్లో బాధ్యత పెంచాను. ప్రాజెక్టుల్ని రద్దుచేసే అధికారం జగన్ కు ఎవరిచ్చారు?
  నేను ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టుల్ని ప్రీక్లోజర్ చేయాలన్నారు. అలాచేయకుండా కాస్ట్ తో ఎక్కడికక్కడ పనులు జరిగేలా చేశాను. ప్రాజెక్టులు సందర్శించి, అవసరమైతే అక్కడే రాత్రిళ్లుఉన్నాను. అవుకు, తోటపల్లి, మదనపల్లెలో రాత్రిళ్లు అక్కడేఉన్నాను. అధికారుల్లో బాధ్యత తీసుకురావడానికి అలా పనిచేశాను. జగన్ ఇన్నేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ వద్ద అయినా ఉండి పనుల్ని పర్యవేక్షించాడా? 102 ప్రాజెక్టులు ప్రీక్లోజర్ చేసి, రద్దుచేయడానికి కారణం డబ్బులు పెట్టాల్సి వస్తుందనే. ప్రాజెక్టుల్ని రద్దుచేసే అధికారం జగన్ కు ఎవరిచ్చారు? మరలా ఐదేళ్లవరకు టెండర్లు పిలవకుండా, పనులు ఆపేస్తే చేసిన పనులు, ఖర్చుపెట్టిన సొమ్ము అంతా వృథాయేగా? మొన్నీమధ్యకూడా రూ.1500కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. ముందుపనులు చేసినవారికి కాకుండా తనకు కమీషన్లు ఇచ్చేవారికి చెల్లిస్తారా? దుబారాచేయడం, దోచుకోవడం, అడిగినవారిపై ఎదు రుదాడిచేయడం ఇదీ వీళ్లకు తెలిసింది. నిన్న వ్యవసాయంపై మాట్లాడాను.. నేడు సా గునీటి ప్రాజెక్టులపై మాట్లాడాను. ఒక్కదానికి సమాధానంచెప్పరు. తేలుకుట్టిన దొంగ ల్లా ఉండిపోయారు. ఆధారాలు, జీవోలు అన్నీ ప్రజలముందు పెడతాను…చేతనైతే సమాధానంచెప్పండి.. అభివృద్ధి నిరోధకులు వైసీపీవాళ్లు.రాష్ట్రాన్ని నాశనంచేశారు. ప్రజా చైతన్యంతో వైసీపీని భూ స్థాపితం చేస్తాం అన్నారు.
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *