గోరంట్లలో వంగావీటి మోహన రంగా విగ్రహావిష్కరణ
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, కాపు ఉద్యమనేత దివంగత వంగవీటి మోహన రంగా కాంస్య విగ్రహావిష్కరణకు గుంటూరులోని గోరంట్ల సెంటర్ ముస్తాబవుతోంది. రంగా వర్ధంతి సందర్భంగా ఈనెల 26 మంగళవారం సాయంత్రం 6 గంటలకు విగ్రహాష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు రాధా-రంగా మిత్ర మండలి వెల్లడించింది. ఇన్నర్ రింగ్ రోడ్ 1 – ఇన్నర్ రింగ్ రోడ్ 2ల మధ్య అమరావతి రోడ్డులో నాలుగు రోడ్ల కూడలిలో 10 అడుగుల రంగా కాంస్య విగ్రహాన్ని అత్యంత సుందరంగా కాంతులీనేలా తయారుచేశారు. విగ్రహాష్కరణ కార్యక్రమానికి రంగా అభిమానులు భారీగా తరలివచ్చి ఆయనకు ఘన నివాళి అర్పించాలని రాధా-రంగా మిత్ర మండలి విజ్ఞప్తి చేసింది.