ap news

సైకో పాలన పోతుంది…ఎన్డీయే వస్తుంది

  • నన్ను ఆదరించిన ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
  • -టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
  • టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట, మాజీ ఎమ్మెల్యేలు గరటయ్య, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి
  • వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని అధినేత హామీ…పిఠాపురంలో పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వర్మకు సూచన
  • పవన్ కళ్యాణ్ ను మంచి మెజారిటితో గెలిపిస్తామన్న వర్మ
  • టీడీపీ లీగల్ సెల్ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు

రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో సైకో పాలన పోయి…ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం తనను ఆదరించిన ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, తనయుడు మాగుంట రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో పాటు వారి అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ….‘‘ఈ రోజు ఒక శుభ దినం..ఎన్నికల కోడ్ వచ్చింది…ఇక ఎవరూ భయపడే పరిస్థితి లేదు. ఆదివారం ప్రజాగళం పేరుతో చిలకలూరిపేటలో బహిరంగ సభతో చరిత్ర సృష్టించబోతున్నాం. రాష్ట్రంలో నిన్నటి దాకా ప్రతి ఒక్కరూ భయపడ్డారు. నా లాంటి వాడు తెగించాడు…నేను కూడా బయపడితే రాష్ట్రంలో మనుగడ సాధించలేరు.
పవన్ కళ్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి
పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గ స్థానం జనసేనకు వెళ్లింది. పిఠాపురంను గతంలో వర్మ బాగా అభివృద్ధి చేశారు. కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా వెనుతిరగలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడంతో సీటును త్యాగం చేయాలని వర్మను కోరా…అందుకు వర్మ అంగీకరించారు. 2014లోనూ పవన్ కళ్యాణ్ రాష్ట్రం బాగుండాలని పోటీ చేయకుండా సహకరించారు. ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది…వ్యతిరేక ఓటు చీలకూడదనే కలిసి పోటీకి వచ్చారు. త్వరలో ప్రకటించే ఎమ్మెల్సీలల్లో వర్మ మొదటి వ్యక్తిగా ఉంటారు. వర్మను అభిమానించే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే వైసీపీ నేతలు ఈర్ష్యతో ప్రవర్తిస్తున్నారు. పిఠాపురంలో వర్మే అభ్యర్థి అనుకుని కార్యకర్తలు పని చేసి పవన్ ను మంచి మెజారిటీతో గెలిపించాలి.
ఒంగోలు ఎంపీ స్థానంలో టీడీపీదే గెలుపు
ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాకతో జిల్లాలో రాజకీయ తిరగబడింది. ఒంగోలు ఎంపీ స్థానంలో గెలుపు టీడీపీదే కాబోతోంది. దర్శి నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థిని త్వరలోనే నియమిస్తాం.’ అని చంద్రబాబు అన్నారు.
పిఠాపురం ఇంఛార్జ్ వర్మ మాట్లాడుతూ…. ‘చంద్రబాబు ఆశీస్సులతో పిఠాపురంలో పార్టీని నిలబెట్టా..కార్యకర్తలను చూసుకుంటున్నా. పురుషోత్తపట్నం ఎత్తిపోతల, ఏలూరు ఫేజ్-2 పనులు ఆగిపోయాయి. వాటిని పూర్తి చేయాలని కోరుతున్నా. చంద్రబాబుకు నేను తాలిబన్ లాంటి శిష్యున్ని. పవన్ కళ్యాన్ ను పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిపిస్తాం.’ అని వర్మ అన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *