ap news

టీటీడీ బోర్డు చైర్మన్ గా బి.ఆర్ నాయుడు

బి.ఆర్ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. టీవీ5 గౌరవ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు టీటీడీ బోర్డు చైర్మన్‌గా కొనసాగనున్నారు. టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల వ్యవస్థాపకులుగా హిందూధార్మిక కార్యక్రమాల నిర్వహణలో బీఆర్ నాయుడు తనదైన ముద్ర వేశారు. టీటీడీ ఛైర్మన్‌తో కలిపి మొత్తం 24 మంది సభ్యుల పేర్లతో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీటీడీ నూతన ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తనను ఛైర్మన్‌గా నియమించినందుకు ఏపీ ప్రభుత్వానికి బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు బీఆర్‌ నాయుడు. కృతజ్ఞతలు తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటన

24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి ప్రకటన
టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా బి.ఆర్‌.నాయుడు నియామకం
టీటీడీ బోర్డులో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు
టీటీడీ బోర్డులో తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు
టీటీడీ బోర్డులో కర్ణాటకకు చెందిన ముగ్గురికి చోటు

టీటీడీ సభ్యులు: ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
టీటీడీ సభ్యులు: ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి
టీటీడీ సభ్యులు: జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు
టీటీడీ సభ్యులు: కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
టీటీడీ సభ్యులు: జంగా కృష్ణమూర్తి, ఆర్‌.ఎన్‌.దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్‌
టీటీడీ సభ్యులు: పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్‌రెడ్డి
టీటీడీ సభ్యులు: అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి
టీటీడీ సభ్యులు: నరేశ్‌ కుమార్‌, డా.అదిత్‌ దేశాయ్‌, సౌరభ్‌ హెచ్‌.బోరా

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *