రాష్ట్రంలో 144 ఆక్సిజన్ ప్లాంట్లు

నేడు ప్రారంభించనున్న సీఎం జగన్ 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం జరగనుంది. రూ. 426 కోట్ల వ్యయంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందుకుగానూ, రూ. 20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ కంటైనర్లను కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సౌకర్యం కల్పిస్తారు. మొత్తం 39 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకు 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ వైరల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published.