ap news

ఆరునెలల్లో కొత్త పీఆర్సీ నివేదిక ఇవ్వాలి

వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి

వేతన సవరణ అందక ఆర్ధికంగా నష్టపోయిన ఉద్యోగులు
30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి
వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
కేశవరపు జాలి రెడ్డి, షేక్ జంషీద్ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన పీఆర్సీ కమిషన్ ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవరపు జాలి రెడ్డి, షేక్ జంషీద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఆరునెలల్లోపు పీఆర్సీ నివేదిక ఇవ్వటంతో తక్షణం మధ్యంతర భృతి ఇవ్వలన్నారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు న్యాయం చేసేలా ప్రత్యేక మార్గదర్శకాల జారీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలతన్నారు.
గత పీఆర్సీ కాలపరిమితి ముగిసి ఇప్పటికే సుమారు మూడేళ్ళయింది.. ఈ మూడేళ్ల కాలంలో వేతన సవరణ ప్రయోజనాలు అందక ఉద్యోగులు ఆర్ధికంగా ఎతో నష్టపోయారు..అనేక మంది ఉద్యోగులు పదవీ విరమణ కూడా చేశారు..ఇప్పటికే తీవ్రంగా ఆలస్యమైన పీఆర్సీకి సంబంధించి తాజాగా ఏర్పాటు చేయనున్న కమిషన్‌కు ఒక సంవత్సరం కాలపరిమితి ఇవ్వడం ఉద్యోగుల్లో మరింత నిరాశను కలిగిస్తోందన్నారు. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇంకా మరో సంవత్సరం పాటు నివేదిక కోసం వేచి ఉండాలని చెప్పడం ఉద్యోగుల ఆర్థిక సమస్యలను మరింత తీవ్రతరం చేయడమేనని అన్నారు. కొత్త పీఆర్సీ కమిషన్‌కు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి.. గరిష్ఠంగా ఆరు నెలల్లో తన నివేదికను సమర్పించేలా కాలపరిమితిని నిర్దేశించాలని డిమాండ్ చేశారు.
పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులు మరింత ఆర్థిక భారాన్ని భరించాల్సిన పరిస్థితి లేకుండా ప్రభుత్వం వెంటనే కనీసం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. కొత్త పీఆర్సీ కోసం ఎదురుచూస్తూ అనేక మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు..వారికి పీఆర్సీ ప్రయోజనాలు ఎలా అందించాలనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని జాలిరెడ్డి, షేక్ షంషీద్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *