నరసరావుపేటలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్
త్వరితగతిన నిర్మించాలని వినతి
క్రీడా వ్యవహరాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ
నరసరావుపేటలోని డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ సబ్ సెంటర్ లో మల్టీ పర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ‘ఖేలో ఇండియా స్కీమ్’ కింద త్వరితగతిన నిర్మించాలని కేంద్ర యువజన క్రీడా వ్యవహరాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారిని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అభ్యర్థించారు. బుధవారం ఢిల్లీలో మంత్రిని కలసి శ్రీకృష్ణదేవరాయలు వినతి పత్రం అందజేశారు.
దీని నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8కోట్లకు సంబంధించిన వివరాలను…రాష్ట్రానికి చెందిన యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖలోని క్రీడలు, యువజన సేవల విభాగం కేంద్రానికి పంపడం జరిగిందని..‘ ఖేలో ఇండియా స్కీం’ కింద త్వరితగతిన నిర్మాణ అంచనా వ్యయం రూ.8కోట్లను మంజూరు చేసి, ఈ కాంప్లెక్స్ ను నిర్మించాలని విన్నవించారు.
దీని నిర్మాణం నరసరావుపేట, చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి క్రీడల్లో రాణించే యువతకు, విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ చెప్పారు.