Literature

అంకాలమ్మ తల్లి దేవస్థానంలో ఘనంగా ఉగాది వేడుకలు

క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక పొదిలి ప్రక్కనే ఉన్న కంభాలపాడు గ్రామంలో అంకాలమ్మ తల్లి దేవస్థానం ప్రాంగణం లో బెల్లంకొండ విద్యా సంస్థలు ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.ఆసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులుగా నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ , కళామిత్రమండలి తెలుగు లోగిలి జాతీయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావులు పాల్గొని మాట్లాడుతూ నేటి క్రోధి నామ సంవత్సర ఉగాది వేళ అందరికీ శుభం జరగాలని, వాదాలు, వివాదాలకు తావులేకుండా,మోదముతో ప్రజామోదం తో ముందుకు సాగాలని సూచించారు.యువత భవితకు బంగారు బాటలు వేసుకోవాలని కాంక్షించారు.మన సంస్కృతి సంప్రదాయాలను, ఆచారాలను పాటించడం మంచిదని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో విద్యా సంస్థల ప్రతినిధులు బెల్లంకొండ శ్రీనివాస్, విజయలక్ష్మి,కొంకాల రామ్మోహన్, వేమా మంజుల, డిప్యూటీ డిఇఓ లక్ష్మణరావు,ఓ.యస్.ఆర్.సీతా రామయ్య, వెన్నెల మల్లిఖార్జునరావు,డి.శివప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పంచాంగ శ్రవణం చేశారు.అనంతరం కవిసమ్మేళనం లో పాల్గొన్న కవులు రచయితలందర్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

టి.అరుణను సన్మానిస్తున్న దృశ్యం
నూనె అంకమ్మరావును సన్మానిస్తున్న దృశ్యం
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *