Medical and Health

మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం

  • నేడు మానసిక ఆరోగ్య దినం
  • అందరికీ మానసిక ఆరోగ్యం
  • నిజం చేయడానికి ప్రయత్నిద్దాం

ప్రపంచ మానసిక ఆరోగ్య దినం 2021 ప్రధాన నినాదం – అసమానతలు లేని ప్రపంచంలో మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం ప్రధాన జన జీవన స్రవంతిలో భాగం కావాలి – నా లక్ష్యం

డాక్టర్ ఝాన్సీ థామస్ ఆస్టర్, ప్రేమ్ హాస్పటల్, అమీర్ ఫేట, హైదరబాద్

కోవిడ్ మహమ్మారి ప్రజల మానసిక ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపింది.  అంతే గాకుండా పలు అంశాలలో ప్రజల అభివృద్ది విషయంలో అసమానతలకు తావివ్వడమే కాకుండా అసలే అంతంత మాత్రంగా ఉండే మానసిక ఆరోగ్య వైద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనే చెప్పవచ్చు.  ఈ పరిస్థితులలో పలువురు మానసిక రోగులకు అవసరమైన వైద్యం అందక వారితో పాటూ వారి కుటుంభాలు కూడా ఎన్నో ఇబ్బందులు, వివక్ష, ఆందోళనకు గురైనాయి.  ఇలాంటి పరిస్థితులలో అందరికీ మానసిక ఆరోగ్య చికిత్స అందించగలిగితే ఎన్నో అసమానతలు తొలగించిన వారవ్వడమే కాకుండా సమాజానికి ఎన్నో లాభాలు చేసిన వారవుతారు.  ఎందుకంటే మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడడం ఇప్పటికీ మన సమాజంలో సిగ్గు చేటుగా భావిస్తారు కాబట్టి.

అందుకే ఒక సైకాలజిస్టుగా నా కల ఏమిటంటే మానసిక ఆరోగ్యమనేది ప్రధాన జన జీవన స్రవంతిలో భాగంగా మారాలి అనేది.  ఇలా మానసిక ఆరోగ్యం ప్రధాన జన జీవన స్రవంతి కావడం వెనుక లక్ష్యం ప్రధానంగా అందరి అభిప్రాయాలను ఒక్క తాటిపై తీసుకొని రావడం.  ప్రస్థుతం మానసిక ఆరోగ్యం కూడలిలో ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యంతో భాద పడే వారి హక్కుల గురించి మనం మాట్లాడితే అది దేనికి సంకేతం.  అది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్నే కాకుండా మొత్తం సమాజం యొక్క మానసిక ఆరోగ్యం బాగుందనే సంకేతాలనిస్తుంది.  ఎలానైతే సాధారణ ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తామే అలానే మానసిక ఆరోగ్యం పై కూడా అవగాహన కలిపించాలి.  ఇలా అవగాహన కలిపించడం అంటే మొత్తం సమాజం లోని అందరికీ మంచి జీవన శైలిని అందించడమే కదా.

మాకు సహాయం కావాలి అని అడగడమే మొదటి అడుగు అయితే అదే అత్యంత కఠిన మైన అంశం.

మానసిక ఆరోగ్యం సరిగా లేదనే విషయాన్ని గుర్తించి అందుకు తగిన చికిత్స అవసరమని తేల్చుకోవడం ఎంతో కష్టం సాధ్యమైన అంశం.  అందుకే మానసిక ఆరోగ్యానికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందని తెలుసుకొనే ముందు అసలు చికిత్స మాకు అవసరమని భావించడమే ముఖ్యం.  సాధారంగా ప్రజలు తమ మానసిక ఆరోగ్యం సరిగా లేదనే విషయాన్ని అంగీకరించరు.  అయితే అందుకు కుటుంభ సభ్యులు, స్నేహితుల మద్దతు సహాయం ఎంతో అవసరపడుతుంది.  వారి సహాయంతో సరైన వైద్య చికిత్స తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా సాధించవచ్చు.

 సైకో థెరపీ – కౌన్సిలింగ్ (మందులతో పని లేని చికిత్స)

 సైకో థెరపీ అనేది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నిపుణులైన మానసిక ఆరోగ్య నిపుణుల ద్వారా అందించే చికిత్స.  సైకో థెరపీ లో మనషి ఆలోచనలు, భావనలు, వారి వారి నడవడికలు గుర్తించి, విశ్లేషించి తద్వారా వాటిని మెరుగు పరచడానికి వీలు కలిపిస్తారు.  అంతే గాకుండా కొన్ని సందర్భాలలో సైకో థెరపీ ని కొన్ని మందులతో కలపి చికిత్స అందించడం వలన ఫలితాలు మంచిగా సాధించడానికి అవకాశం ఉంటుంది.  ఈ సైకో థెరపీ క్రింద అందించే చికిత్సలలో కగ్నిటివ్ బిహేవిరయల్ థెరపీ, యాక్పెప్టెన్స్ కమిట్మెంట్ థరెపీ, రిలాక్సేషన్ థెరపీ, ఎక్స్ పోషర్ థెరపీ, డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ వంటివి ఉన్నాయి.

Examples include: Cognitive Behavioral Therapy, Acceptance Commitment Therapy, Relaxation Therapry Exposure Therapy, Dialectical Behavior Therapy, EMDR (Eye Movement Desensitization and Reprocessing)  etc.

 సమాజంలో అందరికీ మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండడం అంటే మొత్తం సమాజం మంచిగానూ, ఉత్పాదక పెంచేదిలా ఉంటుందనే చెప్పవచ్చు.అందుకే మన సమాజంలో అందరికీ మానసిక ఆరోగ్యం ఉండేలా పని చేద్దాం.

 సంప్రదించండి : 

Dr Johnsey Thomas

Mental Well Being Consultant

Aster Prime Hospital

Ameerpet

Email ID: genesispsyspa@gmail.com

+91 98495 74265

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *