మూత్ర పిండాల వ్యాధులపై ఆస్టర్ ప్రైమ్ వర్క్ షాప్

దీర్ఘ కాలిక మూత్ర పిండాల వ్యాధులపై రోగులకు మరియు వారి సహాయకులకు వ్యాధికి సంబంధించిన పలు అంశాలపై ప్రత్యేకమైన వర్క్ షాప్ ను ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట వారు నేడు నిర్వహించారు. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ యొక్క నర్సింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమలో దీర్ఘ కాలిక మూత్ర పిండాల వ్యాధులతో భాదపడుతున్న రోగులకు సంబంధించిన పలు అంశాలను వివరించడమే కాకుండా అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను వైద్యులు వివరించారు. అంతే గాకుండా డయాలసిస్ చికిత్స తీసుకొంటున్న రోగుల ఆరోగ్య సంరక్షణపై కూడా అవగాహన కలిపించారు. ఈ వర్క్ షాపుకు హాస్పిటల్ లో దీర్ఘ కాలిక మూత్ర పిండాల వ్యాధులకు చికిత్స తీసుకొంటున్న రోగులు మరియు డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగుల కుటుంభీకులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా హాజరైన వారికి స్వాగతం పలికిన లిజో థామస్, నర్సింగ్ విభాగం హెడ్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో రోగికి ప్రాణం పోసే CPR (cardiopulmonary resuscitation) ఎలా చేయాలో అందరూ తెలుసుకోవాలని అన్నారు. తద్వారా తమ ఇంట్లో ప్రమాద స్థితిలో ఉన్న రోగిని వైద్యం అందే లోగా ఈ అత్యవసర చికిత్స రోగి కుటుంభీకులే అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు.

అనంతరం వర్క్ షాపును డా. బి సుధాకర్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు మరియు హెడ్, డయాలసిస్ విభాగం వారు డా. సి ఉమా శ్రీదేవి, ఛీప్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ లు జ్యోతి ప్రజ్వళన ద్వారా వర్క్ షాపును ప్రారంభించారు.

అనంతరం వర్క్ షాపునకు హాజరైన వారి నుద్దేశించి డా. సుధాకర్ మాట్లాడుతూ దీర్ఘ కాలిక మూత్ర పిండాల వ్యాధులతో భాదపడే వారి సహాయకులకు ఈ వ్యాధుల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉండడం ఎంతో అవసరమని అన్నారు. ఇలా అవగాహన ఉండడం వలన రోగులకు అవసరమైన చికిత్స అందించడంతో పాటూ ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో అవగాహన ఉన్న వారు రోగుల ప్రాణాలు కాపాడడంలో వీరు కీలక పాత్ర పోషించవచ్చని తెలిపారు.

అనంతరం డా. చంద్ర శేఖర్, అత్యవసర వైద్య నిపుణులు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నేతృత్వంలోని బృందం అత్యవసర పరిస్థితులలో రోగులకు ఎలాంటి చికిత్స అందించాలనే అంశంపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రోగులకు అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భాలలో ఎలాంటి ప్రాధమిక చికిత్స అందించాలి అటు పిమ్మట హాస్పిటల్ కు ఎలా తరలించాలి తద్వారా మంచి ప్రాధమిక చికిత్స అందించడమే కాకుండా వారి ప్రాణాలకు హాని కలుగకుండా చూసుకోవడం ఎలా అన్న అంశాలపై శిక్షణ అందించారు.

ఈ కార్యక్రమాలలో డా. బి సుధాకర్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు మరియు హెడ్, డయాలసిస్ విభాగం వారు డా. సి ఉమా శ్రీదేవి, ఛీప్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ – శ్రీ నిథిన్ ఆంటోని, హెడ్ ఆపరేషన్స్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్ పేట తో పాటూ పలువురు నర్సింగ్ సిబ్బంది, రోగుల కుటుంభీకులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *