కరాటే కోచ్ ఆర్కే బెనర్జీకి సత్కారం

చి కోకాయ్ ఇంటర్నేషనల్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన బ్లాక్ బెల్ట్ ఛాంపియన్స్ ట్రైనింగ్ కార్యక్రమానికి హాజరై కోచింగ్ ఇచ్చిన ఇంటర్నేషనల్ మెడలిస్ట్, కోచ్ ఆర్కే బెనర్జీకి సత్కారం నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఆరు జిల్లాలకు చెందిన  బ్లాక్ బెల్ట్ క్రీడాకారులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. కరాటే అసోసియేషన్ జిల్లా  చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు,  ప్రకాశం జిల్లా కరాటే సోషల్ ఉపాధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వేలాది మందిని కరాటే లో శిక్షణ ఇచ్చి వారి  భవిష్యత్తుకు బాటలు వేసి ఉత్తమ గురువుగా ఉన్న నల్లూరి మోహన్ రావు అభినందనీయుడని అన్నారు. పోలీస్ శాఖకు ఇతర శాఖలకు కూడా దాదాపు ముప్పై ఏళ్ళ నుండి కరాటే నేర్పించడం గొప్ప విషయమని అన్నారు. వారి ఆధ్వర్యంలో ఆరు జిల్లాల బ్లాక్ బెల్ట్ గ్రహీతలకు శిక్షణ ఇవ్వటం శుభ పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కొచ్  రాజేశ్వరి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కరాటే మాస్టర్స్ ఎం శ్రీనివాస్ రెడ్డి, రామయ్య, రమణ. మురళీధర్ తదితరులు  పాల్గొన్నారు.

కరాటే కోచ్ ఆర్కే బెనర్జీ

 

SHARE THIS NEWS

Leave a Reply

Your email address will not be published.