బోటు ప్రమాద మృతులకు నివాళి

వారితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వాకర్స్ క్లబ్ సభ్యులు

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 2017 సంవత్సరంలో పంచారామాలు సందర్శనకు వెళ్ళి కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో మృతి చెందిన ఒంగోలు రంగారాయుడు చెరువు వాకర్స్ క్లబ్ సభ్యులైన 18 మందికి వారి మితృలు శనివారం నివాళి అర్పించారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ, వాకర్స్ మిత్రులు, సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లామధు, కుర్రా ప్రసాద్ బాబు, వేణు, నూక తోటి శరత్ బాబు, ఆదినారాయణ రెడ్డి అంజిరెడ్డి గోపాలరాజు ,ఓగిరాల చెంచయ్య, ఆదిబాబు, అవిసా హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

Share this:
Prakasam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *